పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాచిత్రం వకీల్ సాబ్ థియేటర్లలోనే కాదు.. ఆ తర్వాత ఓటీటీలోనూ సందడి చేసింది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా అనన్య నాగల్ల, నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ ఓ చిన్న పాత్రలో మెరిసింది. మరో కీలకపాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించారు. కాగా, తాజాగా ‘వకీల్‌సాబ్’ సినిమాలోని ఓ ఫైట్ సీక్వెన్స్‌ని రీక్రియేట్ చేస్తూ నెల్లూరుకు చెందిన కొంతమంది కుర్రాళ్లు ఓ వీడియో రూపొందించారు. కెమెరా యాంగిల్స్, టైమింగ్, ఎడిటింగ్ క్రీటివిటితో సినిమాలో చూపించిన దానికి ఏమాత్రం తీసిపోకుండా మంచి పర్ఫెక్షన్ సాధించారు. ఈ వీడియోని పవర్‌స్టార్ అభిమానులు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. కాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ‘క్రేజీ గాయ్స్’ అంటూ స్పందించాడు.
Seriously what did i see ❤️❤️❤️❤️❤️❤️
— thaman S (@MusicThaman) May 23, 2021
This guys nailed it those high speed shots syncing the music 🎶 to the shots 😍😍😍😍😍😍 Wow 🤩 crazy #VakeelSaabBGM #VakeelSaabOnPrime #VakeelSaab 😷🙋🏽♂️😎 https://t.co/Hct2eyFyI5