గత కొంతకాలంగా పూరి జగన్నాథ్- ఛార్మి కలిసి సినిమాల నిర్మాణం లో భాగమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య మంచి క్లోజ్‌నెస్ పెరిగింది. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ నడుస్తోందంటూ అప్పట్లో రూమర్స్ వచ్చినప్పటికీ.. వాళ్ళు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. కానీ ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత ఈ జోడీ మధ్య బంధం మారింది. దీంతో ఇప్పుడు వీరిద్దరి మధ్య విభేదాలు పెరిగి, వేరువేరుగా ప్రాజెక్టులు చేయాలని నిర్ణయించుకున్నారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి ఇంకో కారణం కూడా ఉందట..
Also Read : ‘#RC16’ : ‘చరణ్ 16’ ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ !
ప్రజంట్ పూరికి ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. అయితే ఆయనతో తో పని చేయడానికి ముందున్న కొందరు హీరోలు ‘ఛార్మి ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాకూడదు’ అనే షరతు పెడుతున్నట్లు గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే వీరు విడిపోయిన కూడా ఆర్థిక వ్యవహారాలలో భాగస్వాములు కాబట్టి తేల్చాల్సిన లెక్కలు చాలానే ఉన్నయట. కానీ ఇప్పుడు ఛార్మి పరిస్థితి గురించి ఆలోచిస్తే.. పూరి దర్శకుడిగా ఫ్యూచర్ లేకుండా పోతుంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ. హీరోల డిమాండ్ మేరకు పురి.. ఛార్మి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పేలా లేదు.