తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటుల్లో రామ్ చరణ్ ఒకరు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తర్వాత దాదాపు మూడు ఏళ్లకు ‘గేమ్ ఛేంజర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చరణ్. కానీ అనుకున్నంతగా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన తదుపరి చిత్రాలపై గట్టిగా ఫోకస్ పెట్టాడు. కాగా చరణ్ నటిస్తున్న వరుస చిత్రాల్లో దర్శకుడు బుచ్చిబాబుతో ‘#RC16’ ఒకటి. ఈ గ్లోబల్ స్టార్ కు జతగా అతిలోక సుందరి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. దీంతో ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Alia Bhatt : అందులో భాగం అవుతున్నందుకు భయంగా ఉంది..
ఈ చిత్రాన్ని బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో రివిల్ కాగా ఇందులో చెర్రీ.. బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతున్న ఈ వీడియో చూసిన అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్‌పై క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే భారీ ఆఫర్స్‌ని పలు టాప్ ఓటిటి సంస్థలు ఈ సినిమా ముందు ఉంచాయట. అందులో మెయిన్‌గా సోనీ లివ్ సంస్థ ఈ సినిమాకి రికార్డు మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. కానీ ఈ సినిమా మేకర్స్ మాత్రం వీటికి మించి దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌తో డీల్ ఫైనల్ చేసే ప్లానింగ్‌లో ఉన్నట్టు టాక్. రామ్ చరణ్ ఆలోచన కూడా ఇదే కావడంతో మేకర్స్ నెట్ ఫ్లిక్స్‌తో టైఅప్ కానున్నట్టుగా సమాచారం. మరి చూడాలి ఈ సినిమాను ఎవరు సొంతం చేసుకుంటారో .