ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక నటుడిగా నిలదొక్కుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. కానీ ఎంతో మంది నటులు తమకున్న టాలెంట్ ప్రూవ్ చేసుకొని ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. అలాంటి వారిలో రాగ్ మయూర్ ఒకరు. ‘సినిమా బండి’ మూవీ తో ఎంట్రీ ఇచ్చి, తన విలక్షణమైన నటనతో.. అద్భుతమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయ్యాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోకుండా నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తూ కెరీర్ లో ఆచితూచి…
ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘సివరపల్లి’ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అదే రోజు రిలీజ్ అయిన గాంధీ తాత చెట్టు సినిమాకి కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక ‘సివరపల్లి’ వెబ్ సిరీస్ లో హీరోగా, గాంధీ తాత చెట్టు సినిమాలో విలన్ గా రెండు భిన్న పాత్రలతో ఒకేరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చిన రాగ్ మయూర్ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు, మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ బాటలో…
రాగ్ మయూర్ అంటే గుర్తుపట్టడానికి కొంత సమయం పడుతుంది ఏమో కానీ మరిడేష్ బాబు అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు అతన్ని. హైదరాబాదులో పుట్టి పెరిగి సినీ రంగం మీద ఆసక్తితో కొన్నాళ్లు సినిమాలతో పాటు ఉద్యోగాన్ని కూడా చేస్తూ తర్వాత పూర్తిస్థాయిలో సినిమాల మీదే ఫోకస్ చేస్తూ వస్తున్నాడు రాగ్ మయూర్. ఈనెల 24వ తేదీన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో గాంధీ తాత చెట్టు సినిమాతో, మరోపక్క లీడ్ రోల్లో సివరపల్లి అనే ఒక వెబ్…