Bollywood : ఒకవైపు రణ్వీర్ సింగ్, మరోవైపు రణ్‌బీర్ కపూర్.. స్టార్ పవరా? సీక్వెల్స్ క్రేజా?

Bollywood News

Bollywood News

ఒకప్పుడు ఖాన్ త్రయం బాలీవుడ్‌ను ఏలితే, ఈ ఇయర్ మాత్రం రణ్వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ ఇద్దరూ బాక్స్ ఆఫీస్ పై ఆధిపత్యం చూపించారు. ‘ధురంధర్ 2’ తో రణ్వీర్ సింగ్ ఏకంగా 1800 కోట్ల మార్కును దాటేస్తే, ‘రామాయణ’తో రణ్‌బీర్ కపూర్ 1000 కోట్ల క్లబ్‌లోకి దూసుకొచ్చాడు. భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాల్లో కథాబలం కన్నా దేశభక్తి, మతపరమైన భావోద్వేగాలు, భారీ విజువల్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఒక సినిమా సీక్వెల్ క్రేజ్‌తో పరుగులు పెడితే, మరో సినిమా ఇతిహాసం పేరుతో భారీ అంచనాల భారాన్ని మోస్తోంది. సౌత్ ఇండియన్ సినిమా అంటే కేవలం మాస్ మసాలా మాత్రమే కాదని మరోసారి నిరూపించిన సినిమా ‘జైలర్ 2’. రజినీకాంత్ స్టార్‌డమ్‌కు తోడు ఫ్రాంచైజీ క్రేజ్ కలవడంతో ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

మరోవైపు ‘దృశ్యం ది కంక్లూజన్’ హిందీ వెర్షన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటింది. అయితే ప్రతి హిట్ సినిమాకు సీక్వెల్ సక్సెస్ కావడం లేదు. ఓల్డ్ సినిమా మ్యాజిక్‌ను మళ్ళీ రిపీట్ చేయడం కూడా రిస్కే. సీక్వెల్స్ పేరుతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశభక్తి అనే ఎమోషన్‌కు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అదే ఫార్ములాతో వచ్చిన ‘బోర్డర్ 2’ ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, మరోసారి వార్ డ్రామాలకు ఉన్న క్రేజ్‌ను నిరూపించింది. ఇక ‘హనుమాన్’ ఆధ్యాత్మిక నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి 450 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ఒకవైపు దేశభక్తి, మరోవైపు దైవభక్తి.. ఈ రెండు భావోద్వేగాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పని చేస్తున్నాయనే విషయం మరోసారి ప్రూవ్ చేసింది.