Bollywood : ఒకవైపు రణ్వీర్ సింగ్, మరోవైపు రణ్‌బీర్ కపూర్.. స్టార్ పవరా? సీక్వెల్స్ క్రేజా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు ఖాన్ త్రయం బాలీవుడ్‌ను ఏలితే, ఈ ఇయర్ మాత్రం రణ్వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ ఇద్దరూ బాక్స్ ఆఫీస్ పై ఆధిపత్యం చూపించారు. ‘ధురంధర్ 2’ తో రణ్వీర్ సింగ్ ఏకంగా 1800 కోట్ల మార్కును దాటేస్తే, ‘రామాయణ’తో రణ్‌బీర్ కపూర్ 1000 కోట్ల క్లబ్‌లోకి దూసుకొచ్చాడు. భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాల్లో కథాబలం కన్నా దేశభక్తి, మతపరమైన భావోద్వేగాలు, భారీ విజువల్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఒక సినిమా సీక్వెల్ క్రేజ్‌తో పరుగులు పెడితే, మరో సినిమా ఇతిహాసం పేరుతో భారీ అంచనాల భారాన్ని మోస్తోంది. సౌత్ ఇండియన్ సినిమా అంటే కేవలం మాస్ మసాలా మాత్రమే కాదని మరోసారి నిరూపించిన సినిమా ‘జైలర్ 2’. రజినీకాంత్ స్టార్డమ్కు తోడు ఫ్రాంచైజీ క్రేజ్ కలవడంతో ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
మరోవైపు ‘దృశ్యం ది కంక్లూజన్’ హిందీ వెర్షన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటింది. అయితే ప్రతి హిట్ సినిమాకు సీక్వెల్ సక్సెస్ కావడం లేదు. ఓల్డ్ సినిమా మ్యాజిక్‌ను మళ్ళీ రిపీట్ చేయడం కూడా రిస్కే. సీక్వెల్స్ పేరుతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశభక్తి అనే ఎమోషన్‌కు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అదే ఫార్ములాతో వచ్చిన ‘బోర్డర్ 2’ ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, మరోసారి వార్ డ్రామాలకు ఉన్న క్రేజ్‌ను నిరూపించింది. ఇక ‘హనుమాన్’ ఆధ్యాత్మిక నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి 450 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ఒకవైపు దేశభక్తి, మరోవైపు దైవభక్తి.. ఈ రెండు భావోద్వేగాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పని చేస్తున్నాయనే విషయం మరోసారి ప్రూవ్ చేసింది.
Also Read
- Sai Pallavi : జుట్టు కట్ చేస్తున్నానని తెలిసి మా అమ్మ ఫోన్ కట్ చేసింది.. పెద్ద దుమారమే రేపింది
- Veeradhi Veerulu: మాస్ మహారాజా - శ్రీవిష్ణు కాంబో మిస్ అయినట్లేనా? ‘వీరాధి వీరులు’పై పిన్ డ్రాప్ సైలెన్స్!
- Keerthy Suresh: స్పెషల్ సాంగ్ నుంచి స్టార్ హీరోల దాకా.. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ రేంజ్ మామూలుగా లేదుగా!
- Box Office Crisis: శుక్రవారం వస్తున్నాయి.. ఆదివారమే వెళ్లిపోతున్నాయి! చిన్న సినిమాలకు అసలేమైంది?
తాజావార్తలు
-
Bollywood : ఒకవైపు రణ్వీర్ సింగ్, మరోవైపు రణ్‌బీర్ కపూర్.. స్టార్ పవరా? సీక్వెల్స్ క్రేజా?
-
Smart Phone Prices Hike: సెల్‌ఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఈ రెండు కంపెనీల ఫోన్ల ధరలు భారీగా పెంపు..
-
Sai Pallavi : జుట్టు కట్ చేస్తున్నానని తెలిసి మా అమ్మ ఫోన్ కట్ చేసింది.. పెద్ద దుమారమే రేపింది
-
Sonia Gandhi Memoir: సోనియా గాంధీ ఆత్మకథలో తప్పులు.. దాచిన విషయాలే వివాదాలు!
-
No Flying Zone: విజయవాడలో అమిత్ షా పర్యటన.. కీలక ప్రాంతాల్లో ‘నో ఫ్లైయింగ్ జోన్’ అమలు..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!