చిన్న సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు రప్పించేందుకు. . టికెట్స్‌పై డిస్కౌంట్స్, ఆఫర్స్ లాంటి తాయిలాలను ప్రకటించారు అనుకుంటే.. చోటా ఫిల్మ్ మేకర్స్ ఏదో తిప్పలు పడుతున్నారు అనుకోవచ్చు కానీ.. పెద్ద సినిమాలకు కూడా ఇదే పరిస్థితి తలెత్తితే.. అవును ప్రస్తుతం ఇలాంటి జిమ్మిక్కులే చేస్తోంది బాలీవుడ్. థియేటర్లకు ప్రేక్షకుడ్ని రప్పించేందుకు నానా అవస్థలు పడుతోంది. కొత్త వాళ్లతో మోహిత్ సూరీ తెరకెక్కించిన సైయారాకు ఇలాంటి ఆఫర్లే ప్రకటించింది యశ్ రాజ్ ఫిల్మ్. టికెట్స్‌పై 50 శాతం డిస్కౌంట్ అప్ టూ రూ. 200 అంటూ ఎనౌన్స్ చేసి సక్సెస్ అయ్యింది. మౌత్ టాక్, పాజిటివ్ రెస్పాన్స్ వల్ల మంచి కలెక్షన్లను అందుకని.. 581 కోట్లను క్రాస్ చేసి.. ఇండియన్ సినీ చరిత్రలో హయ్యెస్ట్ గ్రాసింగ్ లవ్ స్టోరీ మూవీగా నిలిచింది.
Also Read:Mark: ఆసక్తికరంగా కిచ్చా సుదీప్ “మార్క్” టైటిల్ గ్లింప్స్
అజయ్ దేవగన్, మృణాల్ నటించిన సన్నాఫ్ సర్దార్2కి సైయారా తరహాలోనే ఓ ఆఫరే ప్రకటించారు మేకర్స్. ఒక్క టికెట్ కొంటే మరొకటి టికెట్ ఫ్రీ అంటూ జనాలకు ఎరవేసినా.. సినిమా బాగోకపోతే కోట్లు ఇస్తామన్నా.. దేఖను కానీ దేఖరు అని ఫ్రూవ్ చేశారు. ఇక సితారే జమీన్ పర్ కోసం టికెట్ ప్రైజ్ పెంచకుండా రిలీజ్ చేశాడు అమీర్ ఖాన్. ఇప్పుడు బాఘీ4 మూవీ కోసం కూడా ఇలాంటి స్ట్రాటజీనే అప్లై చేశారు మేకర్స్. సెప్టెంబర్ 5న రిలీజౌతున్న రోజున.. ఆడియన్స్ ఫుట్ పాల్ పెంచేందుకు టికెట్‌పై 50 పర్సెంట్ డిస్కౌంట్ ఎనౌన్స్ చేసింది.
Also Read:Balakrishna: ఎలా వస్తానో చెప్పను.. వస్తాను!
యాక్షన్ ప్యాక్డ్ లవ్ స్టోరీ అంటూ వయెలెంట్ చిత్రాన్ని వండి వడ్డిస్తున్నాడు కన్నడ డైరెక్టర్ ఏ హర్ష. ఇప్పటి వరకు సౌత్ సినిమాలను రీమేక్ చేసి బాఘీ నుండి బాఘీ3 వరకు హిట్ కొట్టేసి.. ఫ్రాంచైజీ అంటూ కలరింగ్ ఇచ్చుకుంటోన్న టైగర్ ష్రాఫ్. వరుస ప్లాపులతో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న టైంలో బాఘీ4 అంటూ మరో సౌత్ వంటకాన్నే రెడీ చేశాడు. 2013లో భరత్ హీరోగా తమిళంలో వచ్చిన త్రిబుల్ 5కి రీమేక్ ఇది. ఇంకా వయెలెన్స్ పెంచి తెస్తున్నాడు. ప్రేక్షకులు థియేటర్లకు రారనుకున్నారో.. సౌత్ సినిమాల దండయాత్ర వల్లో ఏమో కానీ పబ్లిసిటీ స్టంట్ కింద ఫస్ట్ డే టికెట్ పై 50 ఆఫర్ ప్రకటించారు. మరీ బీటౌన్ ఆడియన్ యూజ్ చేసుకుంటారో లేక సన్నాఫ్ సర్దార్2లా తిప్పికొడతారో లెట్స్ సీ