Site icon NTV Telugu

Bollywood : నేపో కిడ్స్ పనైపోయింది.. ప్రతిభకు పట్టం కడుతున్న బాలీవుడ్ ఆడియెన్స్..

Bollywood

Bollywood

బీటౌన్‌లో స్టార్ సన్సే కాదు డాటర్స్ హవా కూడా కంటిన్యూ అవుతోంది. ఈ ఏడాది ముగ్గురు యంగ్ అండ్ జెన్ జెడ్ బ్యూటీలు తమ లక్ టెస్ట్ చేసుకునేందుకు బాలీవుడ్ తెరంగేట్రం చేశారు. రవీనా టాండన్ తనయ రాషా తడానీ అజయ్ దేవగన్ సపోర్టుతో ఆజాద్ ఫిల్మ్‌తో తెరంగేట్రం చేసింది. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర పల్టీ కొట్టింది. ఓ స్పెషల్ సాంగ్‌లో మాత్రం రాషా ఇరగదీసి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే టాలెంటైతే ప్రదర్శించింది.

Also Read : Rajasaab : రాజాసాబ్ రచ్చ ముగిసింది.. షూటింగ్ షురూ అయింది..

ఇప్పటి వరకు డిజిటల్ తెరపై సందడి చేసిన బోనీ కపూర్- శ్రీదేవి చిన్న తనయ ఖుషీ కపూర్ ఈ ఏడాది బిగ్ స్క్రీన్‌పై సందడి చేసి ప్రేక్షకులకు టెస్ట్ పెట్టింది. తమిళ్ హిట్ బొమ్మ లవ్ టుడే హిందీ రీమేక్ వర్షన్ లవ్‌యాపాతో అమీర్ ఖాన్ కొడుకు జునైద్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటే బొమ్మ బాక్సాఫీస్ బాంబ్‌గా మారింది. ఖుషీని యాక్టింగ్ రాదంటూ ట్రోల్ చేసేశారు. చేసేది లేక మళ్లీ ఓటీటీ బాటే పట్టింది ఖుషీ. ఇక వీరి కజిన్ శానయా కపూర్ కూడా ఆంఖోన్ కి గుస్తాఖియాతో తెరంగేట్రం చేస్తే మూవీ ఎప్పుడు వచ్చి పోయిందో కూడా తెలియలేదు. స్టార్ కిడ్స్‌కు బీటౌన్ ఆడియన్స్ ఇలాంటి రిజల్ట్ ఇస్తే సైయారాతో లీడ్ హీరోయిన్‌గా మారిన అనీత్ పద్దాని ఓవర్ నైట్ బాలీవుడ్ నయా క్రష్ బ్యూటీగా మార్చేశారు. జీరో ఎక్స్ పెక్టేషన్స్‌తో వచ్చిన ఈ మూవీ రూ. 300 కోట్లకు పైగా రాబట్టుకుని ఇప్పటికీ ఇంకా సక్సెస్ ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. అంటే నెపో కిడ్స్ కాదని సెల్ఫ్ మేడ్ హీరోయిన్‌కి పట్టం కట్టారు బీటౌన్ ఆడియన్స్. దీని బట్టి ఏం అర్థమైందీ స్టార్ కిడ్ హోదా ఎంట్రీ వరకు ఉపయోగపడుతుందేమో కానీ ఆడియన్స్‌ను మెప్పించాలంటే ఫెర్మామెన్స్ చూపించాల్సిందే.

Exit mobile version