Avatar: జేమ్స్ కామెరూన్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ప్రపంచమంతటా డిసెంబర్ 16 విడుదల కానుంది. ఇక ఈ సినిమా కోసం ఈ నెలలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇండియాలో కేవలం 3 రోజులలో 45 స్క్రీన్‌లలో 15,000 ప్లస్ ప్రీమియం ఫార్మేట్ టిక్కెట్లు అమ్ముడుపోవడం విశేషం. భారతదేశం అంతటా ఆరు భాషలలో… (ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ) విడుదల కానుందీ సినిమా. ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డులలో కొత్త బెంచ్ మార్క్ సృష్టించటానికి రెడీ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా 3 వారాలు టైమ్ ఉంది. అయినా ఇంత ముందుగా బుకింగ్స్ ఓపెన్ చేసినా ఇలాంటి స్పందన రావటం థియేటర్ యజమానులకు ఆనందాన్నిస్తోంది. రిలీజ్ కి ముందే బ్లాక్‌బస్టర్ హిట్ సంకేతాన్ని అందచేస్తున్నట్లు పివిఆర్ పిక్చర్స్ సిఇవో కమల్ జియాంచందానీ అంటున్నారు.
Read also: FIFA World Cup : చెత్త రికార్డుతో ప్రపంచకప్నుంచి నిష్క్రమించిన ఖతార్ జట్టు
ఆయన ఇంకా మాట్లాడుతూ ‘జేమ్స్ కామెరూన్ సినిమాలు భారతీయ బాక్సాఫీస్ వద్ద మాయాజాలం సృష్టించాయి. అందుకే ప్రేక్షకులు ఈ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. అది అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కనబడుతోంది. ఈ బుకింగ్ కేవలం ప్రీమియం ఫార్మేట్‌దే. ఇతర అన్ని ఫార్మాట్‌లకు ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నాము’ అన్నారు. ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజేందర్ సింగ్ జ్యాలా మాట్లాడుతూ, ‘అవతార్ సీక్వెల్ ప్రజలు ఎదురు చూసే భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవుతుంది. చాలా ఐనాక్స్ థియేటర్లలో ప్రీమియం ఫార్మేట్ షోలన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఇది మాకు అద్భుతమైన వార్త. మేము సాధారణంగా 3D, 2D బుకింగ్‌లను ప్రారంభించిన తర్వాత బుకింగ్ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది’ అని తెలిపారు. సినీపోలిస్ సీఈఓ దేవాంగ్ సంపత్ మాట్లాడుతూ ’13 ఏళ్ల క్రితం విడుదలైన అవతార్ కి వచ్చిన భారీ స్పందనతో మైమరచిపోయాం. అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ఇప్పటికీ సినీ ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటోంది అవతార్. ఇప్పుడు ఈ సీక్వెల్ ను 2D, వరల్డ్స్ బెస్ట్ 3D టెక్నాలజీలో చూడవచ్చు’ అని అంటున్నారు.
Bank Holidays in December: డిసెంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు, పూర్తి వివరాలు ఇవిగో!