ఏ క్షణం ఏం జరుగుతుందో వూహించలేకుండా.. ఎవరి రాత ఎలా మారిపోతుందో అంచనాలకు అందకుండా.. ప్రతి నిమిషం ఉత్కంఠగా సాగే షో ఏదైనా ఉందంటే అది “బిగ్ బాస్”. తెలుగు ప్రేక్షకులకు స్టార్ మా అందిస్తున్న ఈ షోలో ఇప్పుడు తొమ్మిదో సీజన్ (బిగ్ బాస్ సీజన్ 9) ఎన్నో ప్రత్యేకతలతో సిద్ధమవుతోంది. ఇన్ని సీజోన్లుగా బిగ్ బాస్‌ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటున్న ‘రిటర్న్ గిఫ్ట్’తో హోస్ట్ నాగార్జున చేసిన ప్రోమో పెద్ద సంచలనమే సృష్టించింది.
Also Read : Rashmika : నాపై కుట్ర చేస్తున్నారు.. రష్మిక సెన్సేషనల్ కామెంట్స్
బిగ్ బాస్ సీజన్ 9లో సెలబ్రిటీ లతో పాటు సామాన్యులు కూడా వుంటారు అనేది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిలో పెద్ద డిస్కషన్‌కి తెర తీసింది. ఇంతవరకు ఈ షోని చూశాం.. ఇక హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది అని వేల మంది ఉత్సాహపడ్డారు. కానీ బిగ్ బాస్ ఏదీ అంత సులభంగా తేల్చరు కదా. అందుకే ‘అగ్నిపరీక్ష’ని తీసుకొచ్చారు. కోట్ల మంది ప్రేక్షకులను అలరించాల్సిన కంటెస్టెంట్స్ ఎంపిక చాలా పకడ్బందీగా జరగాలనే ఉద్దేశంతో ఈ పరీక్ష జరుగుతోంది. హౌస్ లోకి వెళ్లేందుకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన వేలాది మంది లోంచి రకరకాలుగా జల్లెడ పట్టి 40 మంది కంటెస్టెంట్స్ ని ఎంపిక చేశారు. ఈ 40 మంది ‘అగ్నిపరీక్ష’ని ఎదుర్కోబోతున్నారు.
Also Read : Tollywood : 30 ఏంటి 50% పెంచుతా..వేతన పెంపుపై నిర్మాత సంచలనం !
అసలు ఈ ‘అగ్నిపరీక్ష’ ఏమిటి? అందులో ఏముంటుంది? ఎలాంటి కఠిన పరీక్షలు పెడతారు? హౌస్ మేట్స్ కావాలనుకుంటున్న వారి ఎంపిక ఎలా జరుగుతుంది? ఇవన్నీ తెలియాలంటే ఈ ‘అగ్నిపరీక్ష’ని చూడాల్సిందే. జియో హాట్ స్టార్ లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ ‘అగ్నిపరీక్ష’ను ఎదుర్కొని 40 మంది నుంచి ఎవరు “బిగ్ బాస్ సీజన్ 9” హౌస్ లోకి వెళ్తారో.. చూద్దాం. సామాన్యుడు స్వరం ఎలా ఉంటుందో విందాం. ఎవరు ఎలాంటి ఆట ఆడిస్తారో చూద్దాం. ‘అగ్నిపరీక్ష’ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.