టాలీవుడ్ లో ప్రస్తుతం నెలకొన్న సమ్మె పరిస్థితుల నేపథ్యంలో రైజింగ్ ప్రొడ్యూసర్స్ చిత్ర నిర్మాణంలో తాము ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు ఎస్ కేఎన్, ధీరజ్, రాజేశ్ దండ, ప్రైమ్ షో చైతన్య, ఛాయ్ బిస్కెట్ శరత్, అనురాగ్, మధుర శ్రీధర్, మహేశ్వర్ రెడ్డి, రాకేష్ వర్రె, తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – ఇండస్ట్రీలో 90 శాతం సినిమాలు చిన్న నిర్మాతలవే. మాకు పదవులు లేవు, మాట్లాడేందుకు పెదవులు తప్ప. ఇది గ్రూపిజం కోసం పెట్టిన ప్రెస్ మీట్ కాదు. చిన్న నిర్మాతలుగా మా బాధలు చెప్పుకునేందుకు పెట్టిన ప్రెస్ మీట్. గుడ్డు పెట్టేవాడికే తెలుస్తుంది బాధ.
Also Read : Aditi Shankar: ఆఫర్లు కావలెను!
మీకు 30 శాతం కాదు 50 శాతం పెంచుతాం. కానీ థియేట్రికల్ గా రెవెన్యూ పరంగా, మేము పెట్టిన ఖర్చు పరంగా, ఏ రూపంలో అయినా మాకు పెట్టుబడి తిరిగొస్తుందని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా. అన్నీ పాన్ ఇండియా సినిమాలు అవుతున్నాయని పెద్ద నిర్మాతలు కొందరు అంటున్నారు. మీ పరిస్థితి వేరు, చిన్న నిర్మాతల పరిస్థితి వేరు. చిన్న సినిమాలకు 25 పర్సెంట్ తగ్గించండి వేతనాలు అని ఫెడరేషన్ తో ఒప్పందం చేసుకుంటే దాన్ని వాళ్లు పాటిస్తున్నారా లేదు. ఏ సినిమాకైనా అదే కష్టం అంటూ పెద్ద సినిమాలతో సమానంగా వేతనాలు తీసుకుంటున్నారు. ఫైనాన్స్ కట్టుకోవాలి, చెప్పిన డేట్ కు సినిమా రిలీజ్ చేయాలి వంటి ఎన్నో టెన్షన్స్ మాలో ఉంటాయి. రోజూ అన్ని ఖర్చులు పెట్టి, ఖాళీ జేబులతో ఇంటికి వెళ్తుంటాం. ప్రొడ్యూసర్స్ మేము అని సంతృప్తి పడతాం. వందల కోట్లు తీసుకునే హీరోలు ఒకరిద్దరే. మా హీరో కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీకి ఎంతో సపోర్ట్ చేశారు. పరిస్థితి అర్థం చేసుకుని ముందు మంచి సినిమా చేద్దామని ముందుకొచ్చారు. అలాంటి హీరోలు ఎంతమంది ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే మీకు 30శాతం కావాలని ఎలా అడగాలని అనిపిస్తోంది.
Also Read : Aditi Shankar: ఆఫర్లు కావలెను!
టికెట్ రేట్సు పెంచుకునేంది వేళ్ల మీద లెక్కపెట్టేన్ని సినిమాలకే. మేము రైజింగ్ ప్రొడ్యూసర్స్ కాదు బర్నింగ్ ప్రొడ్యూసర్స్. మాది మేకపోతు గాంభీర్యమే. చాలా మంది నిర్మాతలకు ఏంటి అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ సినిమాతో డబ్బులు వస్తాయని గ్యారెంటీ ఇచ్చే నిర్మాత ఎవరైనా ఉన్నారా. డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎవరి వైపు ఉన్నారో స్పష్టత ఇవ్వాలి. కావాలంటే మేము సినిమాలు తీయడం ఆపేస్తాం. షూటింగ్ కు ఇంతమందిని తీసుకోవాలి, ఇంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసే హక్కు మీకెక్కడిది. అసలు బిజినెస్ లేదని మేము బాధపడుతుంటే 30 పర్సెంట్ పెంచాలని డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్. కొందరు నిర్మాతలు తమ కేసులు, జెండాలు, అజెండాల మేరకు కార్మికులు అందరికీ ఒకేలా వేతనాలు పెంచాలని అంటున్నారు. సినీ కార్మికుల ముసుగులో తమ స్వలాభం కోసం చూస్తున్నారు. ప్రతి క్రాఫ్ట్ వాళ్లు మీరు ఎవరి వైపు ఉంటారో తేల్చుకోండి. మీరు డిమాండ్స్ మాత్రమే చేసి హక్కులు మర్చిపోతే ఎలా. మీరు మారకుంటే మా బడ్జెట్ లో వచ్చేవాళ్లతో సినిమాలు నిర్మించుకుంటాం. సినిమాకు మాకు కంఫర్ట్ కాదు ప్యాషన్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మాలాంటి చిన్న నిర్మాతలు పడుతున్న ఇబ్బందులపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ బాగుండాలి అని అనుకోవాలి గానీ మేము మాత్రమే బాగుండాలని యూనియన్స్ వాళ్లు ఆలోచించడం సరికాదు. ఏ హీరో కూడా మాకింత ఇవ్వకుంటే షూటింగ్స్ బంద్ అనడం లేదు. పరిస్థితి అర్థం చేసుకుని సినిమాలు చేస్తున్నారు. యూనియన్స్ కూడా ఇది మన ఇండస్ట్రీ మన ప్రొడ్యూసర్స్ అనే భావనతో పనిచేయాలి అని అన్నారు.