Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6లో కెప్టెన్ గా ఎంపికైన వాళ్ళు బోలెడన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దానికి తాజా ఉదాహరణగా కీర్తి భట్, ఆదిరెడ్డి ప్రముఖంగా నిలిచారు. బిగ్ బాస్ షోలో మూడో కెప్టెన్ గా ఆదిరెడ్డి ఎంపిక కాగా అతని తర్వాత మొదటది మహిళా కెప్టెన్ గా కీర్తి భట్ బాధ్యతలు చేపట్టింది. ఆది రెడ్డి కెప్టెన్ గా ఫెయిల్ అంటూ ఏకంగా నాగార్జునే చెప్పగా, ఈ వారం నామినేషన్స్ లోనూ అదే భావనతో అతన్ని అత్యధికంగా ఏడు మంది నామినేట్ చేశారు. ఇదే పరిస్థితి కీర్తి భట్ కూ వచ్చింది. చలాకీ చంటీ హౌస్ నుండి ఎలిమినేట్ కావడానికి పరోక్షంగా కీర్తినే కారణమంటూ గీతు వంటి వారు విమర్శించారు. అలానే కెప్టెన్ గా ఆమె కూడా సరైన పనితీరు కనబర్చలేదంటూ ఏడుగురు నామినేట్ చేశారు. ఆరు నామినేషన్స్ తో గీతు; మూడు నామినేషన్స్ తో బాలాదిత్య, రాజ్; రెండేసి నామినేషన్స్ తో సుదీప, శ్రీహాన్; ఒక్కో నామినేషన్ తో మెరీనా, శ్రీసత్య ఈవారం నామినేషన్స్ జాబితాలో నిలిచారు.
read also: Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్ధం.. 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే..
కెప్టెన్ గా ఉన్న కారణంగా రేవంత్ కు నామినేషన్స్ నుండి వెసులుబాటు కలిగింది. ఫైమా, వాసంతి, ఆర్జే సూర్య, ఇనయా, అర్జున్ లను ఎవరూ నామినేట్ చేయలేదు. ఈ సందర్భంగా అర్జున్ హౌస్ మొత్తానికీ ఓ క్లారిటీ ఇచ్చాడు. తనకు శ్రీసత్యకు మధ్య ఉన్నది ప్యూర్ ఫ్రెండ్ షిప్ అని, ఆమె కారణంగా తాను బలహీన పడ్డానని అనడం, ఆమెకు ఫేవర్ గా ఆడుతున్నానని విమర్శించడం సరికాదని తెలిపాడు. నిజానికి శ్రీసత్య తన బలం తప్పితే, బలహీనత కాదని స్పష్టం చేశాడు. డాన్స్ రాదనే కారణంగానూ, వినోదాన్ని సరిగా పంచలేదనే కారణంగానూ ఆదిని ఎక్కువ మంది నామినేట్ చేస్తే, ఎప్పటిలానే గీతూ యాటిట్యూడ్ నచ్చక ఆమెను కొందరు నామినేట్ చేశారు. ప్రతిసారి జరిగినట్టుగానే ఈసారి కూడా నామినేషన్స్ సమయంలో హౌస్ మెంబర్స్ మధ్య వాడీవేడీ చర్చలు జరిగాయి. బాలాదిత్య – రాజశేఖర్; ఆదిరెడ్డి – రోహిత్; సుదీప – ఫైమా – రాజశేఖర్ వాదోపవాదాలకు దిగారు. అయితే…. ఎవరిని ఎవరు ఎందుకు నామినేట్ చేశారనే విషయంలో రాబోయే రెండు రోజులు హౌస్ లో ఆసక్తికరమైన చర్చలు జరగడం ఖాయం. మరి హౌస్ మెంబర్స్ నామినేట్ చేసిన తోటి సభ్యులను ఎలా కన్వెన్స్ చేస్తారో చూడాలి!
Amaravati Maha Padayatra: పాదయాత్రలో ఉద్రిక్తత.. 3 రాజధానులు కావాలని వైసీపీ నినాదాలు