రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరోక సెన్సషనల్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమాను కూడా స్టార్ట్ చేసాడు రెబల్ స్టార్. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఆ మధ్య కేరళలో ఫినిష్ చేసిన హను సెకండ్ షెడ్యుల్ ను హైదరాబాద్ లో స్టార్ట్ చేసాడు. ప్రభాస్ లేని సీన్స్ ను షూట్ చేసున్నారు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచలి నిర్మిస్తున్నారు.
Also Read : JR. NTR : దేవర 2 అనౌన్స్ మెంట్ వీడియో రాబోతుంది
సెకండ్ షెడ్యూల్ లో సినిమాలో వచ్చే కీలకమైన చైల్డ్ హుడ్ డేస్ ఎపిసోడ్స్ ను తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు హను. అయితే ఒక చిన్న పాత్రలో చిత్ర నిర్మాతలలో ఒకరైన మైత్రీ రవిశంకర్ కుమార్తె లిషా నటించిందట. చిన్న పిల్ల అయినా చాలా బాగా చేసిందట. యూనిట్ మొత్తం లీషా ను అబినందించారట. ఇక ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే మూడు పాటలను సిద్ధం చేసాడట. విశాల్ మ్యూజిక్ పట్ల హను రాఘవపూడి సంతృప్తిగా ఉన్నాడట. బ్రిటిష్ కాలం నాటి రాజకార్ల పాలనలో జరిగిన కథ నేపథ్యంలో ఈ సినిమాను తెరక్కిస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. ప్రభాస్ ఈ చిత్రంలో అగ్రహారం యువకుడిగా కనిపిస్తాడని అలాగే కాప్ లోను కనిపించబోతున్నాడని తెలుస్తోంది.