బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘సికందర్’. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 30న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్రం బృందం ట్రైలర్ ఈవెంట్ నిర్వహించింది. కాగా ఈ ట్రైలర్ యాక్షన్, సస్పెన్స్, డ్రామా కలగలిసిన ఒక వినోదాత్మక చిత్రంగా ఉండబోతోందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ సికందర్ పాత్రలో తనదైన శైలి నటనతో ప్రేక్షకులను మెప్పించనున్నారు. ఆయన పాత్ర ప్రతీకారం, ప్రేమ, న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా కనిపించబోతున్నాడు. రష్మిక కెరీర్‌లో మరో హిట్ పడబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వేడుకలో హీరో హీరోయిన్ల వయసు తేడా గురించి ప్రశ్నలు ఎదురవగా సల్మాన్ ఖాన్ స్పందించారు..
‘ఆమెకు లేని ఇబ్బంది మీకెందుకు? నాకు, హీరోయిన్ మధ్య దాదాపు 31 ఏళ్ల తేడా ఉందని కొందరు అంటున్నారు. హీరోయిన్‌గానీ, ఆమె తండ్రికిగానీ లేని సమస్య మీకెందుకు? రష్మికకు పెళ్లై పాప పుడితే ఆమె కూడా బిగ్ స్టార్ అవుతుంది. అప్పుడు కూడా తల్లిగా రష్మిక అనుమతి తప్పనిసరిగా తీసుకుని నటిస్తా’ అని సమాధానమిచ్చాడు. అలాగే రష్మిక డెడికేషన్ గురించి కూడా మాట్లాడుతూ.. ‘ ఆమె వర్క విషయంలో చాలా సీరియస్‌గా ఉంటుంది. ‘పుష్ప 2’ షూటింగ్ రాత్రి 7 గంటలకు పూర్తిచేసుకుని, తర్వాత మా సినిమా షూటింగ్‌కి రాత్రి 9 గంటకు హాజరయ్యేది. ఉదయం 6:30 గంటలకు వర్క్ చేసి, మళ్లీ పుష్ప సెట్‌కు వెళ్లేది. కాలికి గాయమైనా కూడా ఇబ్బంది పడుతూ షూటింగ్‌లో పాల్గొనింది’ అంటూ చెప్పుకొచ్చాడు.