Bharateeyudu 3 Trailer Raising Expectaions with Kajal: కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 అనే సినిమా వచ్చింది నిజానికి. చాలా కాలం క్రితమే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ అనేక కారణాలతో వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ మధ్యనే పూర్తయింది. ఇ ఈ సినిమాని జూలై 12వ తేదీన ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. మొదటి ఆట నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటున్న ఈ సినిమా తరువాత కూడా భారతీయుడు 3 ఉంటుందని ముందుగానే సినిమా యూనిట్ ప్రకటించింది. అందుకు సన్నాహకాలు చేస్తూనే భారతీయుడు 2 సినిమా టైటిల్స్ పడిపోయిన తర్వాత భారతీయుడు త్రీ సినిమాకి సంబంధించిన చిన్నపాటి ట్రైలర్ ని ప్రదర్శించారు.
Bharateeyudu 2: 2021లో చనిపోయిన వివేక్, నెదుమూడి వేణు భారతీయుడు 2లో ఎలా కనిపించారో తెలుసా?
ఆ సినిమా ఎలా ఉండబోతుంది? ఆ సినిమా లైన్ ఏంటి? అనే విషయాన్ని ముందుగానే రివీల్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ భారతీయుడు 3 అనే సినిమా భారతీయుడు 2 సినిమాకు సీక్వెల్ కాదు. భారతీయుడు వన్, టూ సినిమాలకు అది ప్రీక్వెల్ గా ఉండబోతోంది. అంటే భారతీయుడు మొదటి భాగంలో జరిగిన కథకు, ముందు ఏం జరిగిందనే విషయాన్ని సేనాపతి చేత చెప్పించబోతున్నారు. ఇక ఈ భాగంలో వీరశేఖర్ సేనాపతి(కమల్ హాసన్) అనే పాత్రను చూపించబోతున్నట్టు చూపారు. అయితే అది ఇప్పుడు ఉన్న సేనాపతి పాత్ర యేనా లేకపోతే సేనాపతి తండ్రి పాత్రనా విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. కొంతమంది ఇప్పుడున్న సేనాపతి పాత్రకి పెళ్లి జరగక ముందు ఏం జరిగిందనేది చూపించబోతున్నారు అని అనుకుంటుంటే కొంతమంది మాత్రం ఇది సేనాపతి తండ్రి పాత్ర ఏమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మూడో పార్ట్ వచ్చే దాకా అది ఏమిటి అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం తక్కువే.