late actors Vivek, Nedumudi Venu and Manobala Became part of Bharateeyudu 2 here’s how: కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు 2 ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిజానికి ఈ సినిమా మొదలుపెట్టి సుమారు ఐదేళ్లు అవుతుంది. 2019 జనవరిలో ఈ సినిమా షూటింగ్ ముందుగా ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా కారణంగా కొన్నాళ్లు వాయిదా పడింది. 2020లో సినిమా షూటింగ్ సెట్లో జరిగిన ప్రమాదం కారణంగా చాలా కాలం పాటు సినిమా ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ సినిమా పూర్తి కాదేమో అనుకున్న సమయంలో లైకా ప్రొడక్షన్స్ కమల్ హాసన్, శంకర్ ఇద్దరితో చర్చలు జరిపి సినిమా మొదలు పెట్టింది. అయితే అనూహ్యంగా ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించే ఇద్దరు నటులు 2021లో అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.
Bharateeyudu 2: భారతీయుడు 2లో కుర్చీ మడత పెట్టిన గేమ్ ఛేంజర్!
వారిద్దరు ఎవరో కాదు తమిళ కమెడియన్ వివేక్ అలాగే భారతీయుడు మొదటి భాగంలో సేమాపతిని అరెస్ట్ చేసే పాత్రలో నటించిన సిబిఐ ఆఫీసర్ నేదుమూడి వేణు. ఇక గత ఏడాది తమిళ కమెడియన్ మనోబాల కూడా కన్నుమూశారు. మిగతా ఇద్దరితో పోలిస్తే మనోబాల పాత్ర చాలా చిన్నది. రెండు మూడు సీన్స్ లో మాత్రమే ఆయన కనిపిస్తారు. అయితే ఈ ముగ్గురు చనిపోయిన తర్వాత కూడా షూట్ చేయాల్సిన కొంత భాగం మిగిలిపోయే ఉండడంతో శంకర్ అండ్ టీం టెక్నాలజీ సాయంతో వాళ్లని మళ్లీ రీ క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది. విఎఫ్ఎక్స్ తో పాటు ఏఐ టూల్స్ కొన్ని వాడి వాళ్లని మళ్లీ సజీవంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేసినట్లుగా చెబుతున్నారు. ఇందుకుగాను సినిమా టీం కి దాదాపు 12 కోట్ల రూపాయల ఖర్చయినట్లు చెబుతున్నారు.