Bahirbhoomi: “బహిర్భూమి” నాకు మంచి పేరు తీసుకొస్తుంది: అజయ్ పట్నాయక్
- నత్తితో ఒక పాట కంపోజ్ చేసిన అజయ్ పట్నాయక్
- 12 సినిమాలకు మ్యూజిక్ అందించిన అజయ్
- త్వరలో రిలీజ్ కానున్న "బహిర్భూమి"
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ లో నోయల్ , రిషిత నెల్లూరు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “బహిర్భూమి”. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తుండగా మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది బహిర్భూమి. “బహిర్భూమి” సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా హైలైట్స్ తో పాటు తన కెరీర్ విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్.
Q : ఇంటిపేరు పట్నాయక్ అని ఉంది.. ఆర్పీ పట్నాయక్ కు మీకు రిలేటివ్ ఆ..?
Also Read
Ans – మాది విజయనగరం. మా ఫ్యామిలీ రోషన్ బ్యాండ్ పేరుతో శుభకార్యాల్లో సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండేది. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ నాకు కజిన్ బ్రదర్. ఆయన చిత్రం సినిమాతో సంగీత దర్శకుడిగా మారి మంచి పేరు తెచ్చుకున్నాడు. మా ఇంట్లో సంగీత వాతావరణం ఉండేది. అలా నాకూ సంగీతం పట్ల ఆసక్తి ఏర్పడింది. కీ బోర్డ్ నేర్చుకున్నాను. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు అన్నయ్య ఆర్పీ పట్నాయక్ దగ్గర, ఆ తర్వాత మణిశర్మ గారి దగ్గర వర్క్ చేశాను. అలా చిత్ర పరిశ్రమలో నా ప్రయాణం మొదలైంది.
Q : ఇప్పటి వరకు ఎన్ని సినిమాలకు వర్క్ చేసారు..?
Ans – ఇప్పటిదాకా సంగీత దర్శకుడిగా 12 సినిమాలు చేశాను. ప్రస్తుతం నేను చేసిన 13వ సినిమా “బహిర్భూమి”. ఈ చిత్రంలో సాంగ్స్ కు . వ్యూస్ బాగా వస్తున్నాయి. ఈ సినిమా నాకు సంగీత దర్శకుడిగా పేరు తెస్తుందని బలంగా నమ్ముతున్నాను. నా సినిమాకు ఒక మంచి గుర్తింపు వచ్చి సంగీత దర్శకుడిగా నేను ఫేమ్ అయ్యేవరకు ఎలాంటి ప్రచారం వద్దు అనుకున్నాను.
Q : ఈ సినిమా ఎలా ఉదనబోతుంది..?
Ans – “బహిర్భూమి” సినిమాను ఒక ఆడియెన్ గా చూసి చెబుతున్నా. మూవీ చాలా బాగుంటుంది. ఒక కొత్త తరహా కంటెంట్ ను మెసేజ్, ఎంటర్ టైన్ మెంట్ రెండూ కలిపి దర్శకుడు రాంప్రసాద్ చక్కగా తెరకెక్కించారు.
Q : మీకు ఇష్టమైన సంగీత దర్శకుడు ఎవరు..?
Ans – సంగీత దర్శకుడిగా నాకు ఏఆర్ రెహమాన్ అంటే చాలా ఇష్టం. రోజా సినిమా రిలీజ్ టైమ్ కు నాకు 8 ఏళ్లు. రోజా పాటలన్నీ పాడేవాడిని. ఆయనను ఒకసారి కలిసే అవకాశం వచ్చింది. సింగర్ కృష్ణ పాటలను ఇష్టపడతా.
Q : ఆర్పీ పట్నాయక్ సపోర్ట్ మీకు ఉంటుందా..?
Ans – సంగీత దర్శకుడిగా మా అన్నయ్య ఆర్పీ పట్నాయక్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. ఆయన ప్రభావం నా మీద పడకుండా జాగ్రత్తగా ట్యూన్స్ చేస్తుంటా. గతంలో ఓ సినిమాలో పాటకు ఆర్పీ గారే తమ్ముడికి సాంగ్ చేసి ఇచ్చారేమో అని కామెంట్ చేశారు. కానీ నాకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకునేలా మ్యూజిక్ చేయాలనేది నా కోరిక.
Q : ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి..?
Ans – ప్రస్తుతం “బహిర్భూమి” సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా. మరో మూడు చిత్రాలకు అవకాశాలు వచ్చాయి. అవన్నీ లవ్, ఎంటర్ టైన్ మెంట్ మూవీస్. నాకు స్వతహాగా లవ్ మూవీస్ కు మ్యూజిక్ ఇవ్వడం అంటే ఇష్టం. కొత్త సినిమాల వివరాలు త్వరలో వెల్లడిస్తా.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!