Tollywood: కైపెక్కించే భామలు కావాలంటే టాలీవుడ్ చూపు ఇంకా అటు వైపే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ బడ్జెట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన టాలీవుడ్, హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి మాత్రం బీ టౌన్ వైపు చూస్తుంది. నార్త్ బెల్ట్ మార్కెట్ ను కొల్లగొట్టేందుకు బాలీవుడ్ నుంచి కలర్‌ఫుల్ భామల్ని బరిలోకి దింపుతున్నారు ఇక్కడ డైరెక్టర్స్. టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలు తీస్తుంటే హీరోలు ఇక్కడి వాళ్లే, కానీ హీరోయిన్స్ కోసం బాలీవుడ్ వైపు చూస్తుంది. ట్రిపుల్ ఆర్ తో నేషనల్, ఇంటర్నేషనల్ బ్యూటీలను దర్శక ధీరుడు రాజమౌళి తీసుకువచ్చి సక్సీడ్ కావడంతో, మిగిలిన టీ టౌన్ దర్శకులు కూడా నార్త్ కలర్‌ఫుల్ భామల వైపే చూస్తున్నారు. కల్కితో దీపికా పదుకొణె, దేవరతో జాన్వీని పట్టుకొచ్చారు. అంతకుముందు కియారా, శ్రద్ధా కూడా ఎంట్రీ తీసుకున్నారు. ఇప్పుడు రాజమౌళి తన అప్ కమింగ్ ‘వారణాసి’ కోసం హాలీవుడ్ లో సెటిల్ అయిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకను పట్టుకొచ్చాడు.
అట్లీ, బన్నీ హై బడ్జెట్ మూవీ ‘రాకా’లో దీపికా పదుకొణెతో పాటు జాన్వీ ఫిక్స్ అయినట్లు టాక్. అలాగే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఏ23 లోనూ బాలీవుడ్ బ్యూటీని తెచ్చే యోచనలో టీం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక స్పిరిట్ నుండి దీపిక తప్పుకోవడంతో, మరో బాలీవుడ్ రైజింగ్ బ్యూటీ తృప్తి దిమ్రిని ఫైనల్ చేశాడు వంగా. కల్కి 2 కోసం ఆల్ఫా బ్యూటీని పట్టుకొస్తున్నాడట నాగ్ అశ్విన్. ఇప్పుడు బుచ్చిబాబు గురువు సుకుమార్ కూడా రామ్ చరణ్ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ వైపే చూస్తున్నాడని టాక్. గతంలో ‘స్త్రీ 2’ బ్యూటీ శ్రద్ధా పేరు వినిపించింది. అయితే పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కోసం అప్రోచ్ అయితే ఏకంగా ఆరు కోట్లు అడగడంతో షాక్ కి గురైన సుకుమార్ ఆమెను పక్కన పెట్టేసాడని సమాచారం. అయినప్పటికీ బీటౌన్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని నార్త్ బ్యూటీ వైపే చూస్తున్నాడని టాక్. చరణ్ కోసం సుక్కు నార్త్ బ్యూటీని తెస్తాడా, సౌత్ భామతో సరిపెట్టేస్తాడా?
Also Read
- Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
- Varanasi: ‘వారణాసి’ ఊచకోత.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.320 కోట్ల బిజినెస్సా?
- The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
- Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
తాజావార్తలు
-
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
-
PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
-
Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
-
National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
-
Nitin Gadkari: అండర్‌వరల్డ్, రెడ్‌లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!