Lokesh Kanagaraj: సూర్య, కార్తీలకు లోకేష్ ‘హ్యాండ్’? స్టార్ బ్రదర్స్‌ను పక్కనపెట్టి బన్నీ వెనుక పడ్డాడా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lokesh Kanagaraj: రజనీకాంత్ ‘కూలీ’ ఫలితం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాకపోయినా, దర్శకుడు లోకేష్ కనగరాజ్ బ్రాండ్ ఇమేజ్‌కు పడిన గండి ఏమీ లేదు. కోలీవుడ్ టాప్ స్టార్స్ ఇప్పటికీ ఆయనతో వర్క్ చేయడానికి తహతహలాడుతున్నారు. ముఖ్యంగా అగ్ర హీరోలైన సూర్య, కార్తీ సోదరులు లోకేష్ దర్శకత్వంలో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. అయితే, లోకేష్ మాత్రం ఈ స్టార్ బ్రదర్స్‌ను కావాలనే పట్టించుకోవడం లేదా? వారికి కనీసం ఫోన్ చేసి కూడా మాట్లాడే తీరిక లేనంతగా లైట్ తీసుకుంటున్నాడా? అంటే తాజాగా ఇద్దరు హీరోలు చేసిన కామెంట్స్ ఆ అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.
‘విక్రమ్’లో కొద్ది నిమిషాల పాటు కనిపించి ఇండియన్ సినిమాను షేక్ చేసిన క్యారెక్టర్ ‘రోలెక్స్’. ఈ రోలెక్స్ పాత్రతో సూర్య లీడ్ రోల్లో పూర్తి స్థాయి సినిమాను తెరకెక్కిస్తానని గతంలో లోకేష్ స్వయంగా ప్రకటించాడు. కానీ ఆ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. రీసెంట్గా దీనిపై సూర్యకు ప్రశ్న ఎదురవగా.. “చర్చలైతే సాగుతున్నాయి.. ఇంకా చాలా ప్రాసెస్ ఉంది” అని చెబుతూనే, “లోకేష్‌ను నాకు ఓసారి ఫోన్ చేయమనండి.. కలవమనండి” అంటూ నవ్వుతూనే సెటైరికల్ కామెంట్ చేశాడు. బయటకు ఇది సరదా సంభాషణలా కనిపించినా, లోకేష్ తనకు అందుబాటులో ఉండటం లేదనే అసహనం సూర్య మాటల్లో సున్నితంగా బయటపడిందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)కి పునాది వేసిన సినిమా ‘ఖైదీ’. ఆ సినిమాకు సీక్వెల్ ‘ఖైదీ 2’ ఎప్పుడు వస్తుందా అని కార్తీ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఏ ఈవెంట్లో అడిగినా కార్తీ “త్వరలోనే ఉంటుంది” అని చెప్పడం తప్ప సినిమా మాత్రం సెట్స్‌పైకి వెళ్లడం లేదు. ‘సర్దార్ 2’ వేడుకలోనూ కార్తీ అదే మాట రిపీట్ చేశాడు. ఒకానొక సందర్భంలో “ఖైదీ 2 గురించి నన్ను కాదు.. లోకేష్‌నే అడగండి” అంటూ కార్తీ చేతులెత్తేయడం పరిస్థితిని స్పష్టం చేస్తోంది.
Also Read
- The Traitors Telugu: "ది ట్రైటర్స్" తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
- Basil Joseph: ఆఫర్స్ లేక కాదు.. కావాలనే యాక్టింగ్‌కు బ్రేక్.. బాసిల్ పెద్ద ప్లానే!
- Vijay Sethupathi: విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత!
- Renu Desai: 14 ఏళ్లుగా ఇదే పరిస్థితి.. నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?
‘డీసీ’ చిత్రంతో హీరోగానూ ప్రూవ్ చేసుకున్న లోకేష్ దృష్టంతా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌పైనే ఉందని తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రం రాబోయే రోజుల్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. బన్నీ ప్రాజెక్ట్ మొదలైతే కనీసం ఏడాది నుంచి రెండేళ్ల పాటు లోకేష్ పూర్తిగా లాక్ అయిపోతాడు. అంటే, సమీప భవిష్యత్తులో ‘ఖైదీ 2’ గానీ, ‘రోలెక్స్’ స్టాండలోన్ మూవీ గానీ మొదలయ్యే ఆస్కారమే కనిపించడం లేదు. కోలీవుడ్‌లో స్టార్ హీరోలైన సూర్య, కార్తీ లాంటి అగ్ర నటులు డేట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. లోకేష్ మాత్రం వారిని హోల్డ్‌లో పెట్టి, టాలీవుడ్ స్టార్ బన్నీతో పాన్ ఇండియా రేంజ్‌కు దూసుకెళ్లడానికే మొగ్గు చూపుతున్నాడు. మరి లోకేష్ ఇచ్చే ఈ వరుస ‘షాకులకు’ తమిళ బ్రదర్స్ నిరీక్షణ కొనసాగిస్తారా లేక ప్రాజెక్టులపై ఆశలు వదులుకుంటారా అనేది కాలమే నిర్ణయించాలి.
తాజావార్తలు
-
Lokesh Kanagaraj: సూర్య, కార్తీలకు లోకేష్ ‘హ్యాండ్’? స్టార్ బ్రదర్స్‌ను పక్కనపెట్టి బన్నీ వెనుక పడ్డాడా!
-
Gold & Silver Price Drop: ధన త్రయోదశి వేళ గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
Saltలో ఈ ఒక్క మార్పు చేయండి.. లక్షలాది ప్రాణాలు కాపాడండి! పరిశోధనలో కీలక విషయాలు
-
CM Chandrababu: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యం.. SIPBలో చంద్రబాబు కీలక ఆదేశాలు
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
ట్రెండింగ్
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!