డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ టాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు మరో ఎక్సైటింగ్ మూవీ ‘వచ్చినవాడు గౌతమ్’ రాబోతున్నారు. మెడికో థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రవల్లిక యోగి కో – ప్రొడ్యూసర్. ఇప్పటికే విడుదలైన పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read:Tollywood: అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి
మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్, హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో పాల్గొని పాక్-ఆక్రమిత కాశ్మీరులో శత్రువులతో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందిన వీర జవాన్ మురళి నాయక్ కుటుంబానికి నిర్మాత చెక్ అందించారు. “ధర్మం దారి తప్పినప్పుడు… ఏ అవతారం రానప్పుడు… వచ్చినవాడు గౌతమ్”అంటూ హీరో మనోజ్ మంచు పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్ ఓ యాక్ష్ మూడ్‌ను సెట్ చేస్తుంది. మొదటి ఫ్రేమ్ నుంచే టీజర్ కట్టిపడేస్తుంది.
Also Read:Hari Hara Veera Mallu: హైపెక్కిస్తారట రెడీగా ఉండండి!
గౌతమ్ పాత్రలో అశ్విన్ బాబు కనిపించిన తీరు పవర్‌ఫుల్, ఇంటెన్స్, మిస్టీరియస్ గా ఉంది. ఆయన బాడీ లాంగ్వేజ్, యాక్షన్ టైమింగ్ అన్నీ ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురిచేస్తున్నాయి. టీజర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు కొత్తదనాన్ని పంచుతుండగా, ఎమోషనల్ ఇంటెన్సిటీ కథలో ఉన్న డెప్త్‌ను తెలియజేస్తుంది. దర్శకుడు మామిడాల ఎం.ఆర్. కృష్ణ ఈ చిత్రాన్ని ఓ రొటీన్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా కాకుండా, కొత్త కాన్సెప్ట్‌తో తెరపై తీసుకురావాలని టీజర్ నుంచే అనిపిస్తున్నారు. టీజర్ విజువల్స్‌ని మించిపోయేలా ఎం.ఎన్. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ యాక్షన్ థ్రిల్‌ని కలిపి చూపిస్తుంది. గౌర హరి అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ఇంటెన్స్ ని ఇచ్చింది. మొత్తానికి టీజర్ అయితే సినిమాపై అంచనాలు పెంచింది.