‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు డేట్స్ ఇవ్వడంతో సినిమా షూటింగ్ పూర్తయింది. మొదటి భాగాన్ని ఎన్నో వాయిదాల తర్వాత జూలై 12వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే, రిలీజ్‌కు ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉన్నందున, ఇప్పటి నుంచి సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:Ileana : పాపం.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ఇలియానా
సినిమా నుంచి ఒక మంచి సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. సినిమా మొత్తంలో హైలైట్‌గా నిలిచే ‘ప్రళయకాల రుద్రుడల్లే’ అనే సాంగ్ సినిమాపై హైప్ పెంచేందుకు ఉపయోగపడనుందని తెలుస్తోంది. రాంబాబు గోసాల రాసిన ఈ సాంగ్‌కు కీరవాణి సంగీతం అందించారు. అంతేకాదు, స్వయంగా ఆయనే ఈ పాటను ఆలపించినట్లు కూడా తెలుస్తోంది. ఈ పాట విన్నవారు ఇప్పటికే బాగా కుదిరిందని అంటున్నారు. కాబట్టి, ఇది ‘హరిహర వీరమల్లు’కు పర్ఫెక్ట్ ప్రమోషనల్ లాంచ్ అని చెప్పొచ్చు. ఈ పాట ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తుండగా, మొదట క్రిష్ దర్శకత్వం వహించారు. సినిమా బాగా ఆలస్యం కావడంతో ఆయన తప్పుకోవడంతో, ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.