అయితే, అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లు తయారైంది టాలీవుడ్ రిలీజ్‌ల పరిస్థితి. అసలు విషయం ఏమిటంటే, సంక్రాంతి తర్వాత సమ్మర్ మంచి సీజన్. ఈ సీజన్‌లో సినిమాలు రిలీజ్ చేస్తే, సమ్మర్ హాలిడేస్ ఎఫెక్ట్ కూడా పనికివచ్చి మంచి కలెక్షన్స్ వస్తాయని భావించేవారు. కానీ, ఇప్పుడు సమ్మర్‌లో అసలు సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ నెల మొత్తం మీద రిలీజ్ అయిన పెద్ద సినిమాలు కేవలం రెండే—నాని నటించిన ‘హిట్ 3’ తో పాటు ‘సింగిల్’.
Also Read:Hari Hara Veera Mallu: హైపెక్కిస్తారట రెడీగా ఉండండి!
వాస్తవానికి, ఈ నెల మొత్తం మంచి రిలీజ్ స్లాట్‌లు ఉన్నాయి. కానీ, ఏ ఒక్క సినిమా కూడా పూర్తిగా రిలీజ్‌కు రెడీ కాకపోవడంతో, మే 30వ తేదీన రావాల్సిన ‘కింగ్‌డమ్’ కూడా వాయిదా పడింది. నిజానికి, మే 9వ తేదీన ‘హరిహర వీరమల్లు’ రావాల్సి ఉంది. కానీ, ఆ సినిమా కంటెంట్ కూడా రెడీ కాకపోవడంతో దాన్ని కూడా వాయిదా వేశారు.
Also Read: SSMB29: మరో స్టార్ హీరోను దింపుతున్న జక్కన్న
ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, వస్తే అన్ని సినిమాలు కట్టకట్టుకుని ఒకేసారి రిలీజ్ డేట్స్ మీద దండయాత్ర చేస్తున్నాయి. లేదంటే, థియేటర్లు ఖాళీగా ఉండి, ఏ సినిమా వేయాలా అని ఎగ్జిబిటర్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎవరికి వారు తమ సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడంతో ఈ తరహా పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పొచ్చు. సమిష్టిగా నిర్మాతలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప, దీనికి సరైన సొల్యూషన్ దొరకదు.
ఇప్పుడు థియేటర్లు ఖాళీగా ఉండడంతో, సినిమాల రీ-రిలీజ్‌లు చేయాలని కూడా ఎగ్జిబిటర్లు ఆలోచిస్తున్నారు. మొత్తం మీద, టాలీవుడ్‌లో ఈ అతివృష్టి-అనావృష్టి పరిస్థితి మరోసారి హాట్ టాపిక్‌గా మారుతోంది.