భాషతో సంబంధం లేకుండా తన కంటూ ఒక తిరుగులేని పేరు సంపాదించుకున్నాడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ప్రస్తుతం దశలో ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నాడు రెహమాన్. ఇక హిందీలో ‘తాళ్’ మూవీ తో మొదలు ఎన్నో అద్భుతాలు చేశాడు. అందుకే ముందు నుంచి బాలీవుడ్‌లో ఏ భారీ చిత్రం మొదలవుతోందన్నా, దర్శక నిర్మాతలు రెహమాన్ వైపే చూసేవాళ్లు ఒకప్పుడు. కానీ గత దశాబ్ద కాలంలో రెహమాన్ జోరు బాగా తగ్గింది. ఆయన తన స్థాయికి తగ్గ సంగీతం ఇవ్వడం లేదు, అభిమానులు కూడా ఇదే ఫీలవుతున్నారు. ఇప్పుడు చావా మూవీ విషయంలో కూడా అదే జరిగింది. అవును..
Also Read: kaithi: కార్తి ‘ఖైదీ 2’ లో కమల్ హాసన్
తాజాగా విడుదలైన ‘చావా’ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.ఐతే ఈ సినిమాకు సంబంధించిన అన్ని అంశాల మీద ప్రశంసలు వినిపిస్తున్నాయి కానీ.. రెహమాన్ సంగీతం గురించి మాత్రం ఎక్కడ కూడా ప్రస్తావన రావడం లేదు. కానీ ఇంత గొప్ప చిత్రానికి రెహమాన్ సరైన పాటలు, నేపథ్య సంగీతం ఇవ్వలేదని చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో మండి పడుతున్నారు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాకు సరిపడా సౌండ్ ఇవ్వకుండా.. మోడర్న్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాడి సన్నివేశాల బలాన్ని తగ్గించాడని రెహమాన్‌ను విమర్శిస్తున్నారు.