మన దక్షిణాదిన ఎంతోమంది సంచలన దర్శకులు ఉన్నారు.. కానీ యూనివర్స్ అనేది ఒకటి క్రియేట్ చేయవచ్చు.. ఓ సినిమా పాత్రలను మరో సినిమాలోకి తీసుకురావచ్చనే ఐడియా మాత్రం లోకేష్ కనకరాజ్ పరిచయం చేశారు. తనకంటూ ఓ సినీ ప్రపంచాన్ని క్రియేట్ చేసారు. అదే దారిలో ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు కూడా వెళ్తున్నారు. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ లాంటి సినిమాలతో లోకేష్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు ఈయనతో సినిమా చేయాలని ప్రతి ఒక హీరో అత్రుతగా ఉన్నారు. కాగా ప్రజంట్ లోకేష్ రజినీకాంత్‌తో ‘కూలీ’ చిత్ర షూటింగ్‌లో బీజిగా ఉన్న లోకెష్.. ‘ఖైదీ 2’ తో పాటు ‘విక్రమ్ 2’, ‘లియో 2’ కూడా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా ‘ఖైదీ 2’తో రాబోతున్నాడు లోకేష్.
Also Read: Chhaava: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘చావా’..
2019లో కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటించిన ‘ఖైదీ’ మూవీ ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో మనకు తెలిసిందే. మొత్తానికి ‘ఖైదీ 2’ కూడా పట్టాలెక్కుతోంది. కాగా తలైవా తో ‘కూలీ’ సినిమా పూర్తయిన వెంటనే దీనికోసమే రంగంలోకి దిగనున్నారు లోకేష్. ఇక ఇప్పటికే సూర్య ఈ చిత్రంలో రోలెక్స్ పాత్రతో సందడి చేయనున్నట్లు వార్తలు బయటకు రాగా. ఇప్పుడీ ప్రాజెక్ట్ గురించి మరో ఆసక్తికర విషయం వైరల్ అవుతుంది. ఏంటీ అంటే ఈ సినిమాలో కమల్ హాసన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడట. అంతేకాదు ఈ చిత్ర క్లైమాక్స్ ‘విక్రమ్ 2’కు లీడ్ ఇచ్చేలా ఉంటుందని.. దానికి హీరో విజయ్ తో వాయిస్ ఓవర్ ఇప్పించాలన్న ఆలోచన చేస్తున్నాడట లోకేష్. వీటన్నింటి గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.