Anil Ravipudi: రేపే అనిల్ రావిపూడి కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస విజయాలతో దూసుకుపోతున్న సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర సృష్టించడానికి సిద్ధమయ్యారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మాణంలో అనిల్ రావిపూడి ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ లు హీరోలుగా నటించనున్న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమాలను రేపు, అంటే జూన్ 18వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుంచి చాలా గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. అనిల్ రావిపూడికి బాగా కలిసొచ్చిన రామానాయుడు స్టుడియోలో ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి మార్క్ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించబోతున్నారు. శ్రీమతి అర్చన సమర్పణలో, జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. అరటి ఆకులు, పచ్చటి ప్రకృతి బ్యాక్‌డ్రాప్‌తో చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తూ డిజైన్ చేసిన ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని ఒక్కసారిగా పెంచేసింది. రేపు జరగబోయే ఈ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ స్టార్ హీరోలు, దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరుకాబోతున్నట్లు సమాచారం.
Also Read
- Gatta Kusthi 2: "విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది".. నెట్‌ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
- Peddi : 400 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ పెద్ది
- Tamannaah: ‘కావాలయ్యా ’ సాంగ్‌లో నా డ్యాన్స్ నాకే నచ్చలేదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
- "Aadarsha Kutumbam" కి రీషూట్లు! జాగ్రత్తపడ్డ త్రివిక్రమ్
తాజావార్తలు
-
Anil Ravipudi: రేపే అనిల్ రావిపూడి కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
Kitchen Hacks: వర్కింగ్ ఉమెన్స్ కోసం కిచెన్ సీక్రెట్స్.. ఈ చిట్కాలతో వంట పని ఇక చిటికెలోనే!
-
Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
-
IND Vs AFG: వీర విహారం చేసిన టీమిండియా బ్యాటర్స్.. ఆఫ్ఘనిస్థాన్ ముందు కొండంత టార్గెట్..
-
Donald Trump: ఒప్పందం ఖరారు కాలేదు, బాంబులు వేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!