Bacchala Malli : టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ తాజాగా “ఆ ఒక్కటి అడక్కు”సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.దర్శకుడు మల్లి అంకం తెరకెక్కించిన ఈ సినిమాలో “ఫరియా అబ్దుల్లా” హీరోయిన్ గా నటించింది..అయితే వరుసగా యాక్షన్ సినిమాలతో వచ్చి హిట్స్ అందుకుంటున్న అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మరోసారి తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.తాజాగా ఈ మూవీ ఓటిటిలోకి వచ్చేసింది.ఇదిలా ఉంటే అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బచ్చల మల్లి”.సోలో బ్రతుకే సో బెటర్ మూవీ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా మరియు బాలాజీ గుత్తా ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..
Read Also :Ramcharan : గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్ వైరల్..
రీసెంట్ గా ఈ సినిమాలో అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా అల్లరి నరేష్ గుబురు గడ్డంతో బీడీ కాలుస్తూ ఊర మాస్ లుక్ లో కనిపించాడు.ప్రస్తుతం అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ డీల్ జరిగినట్లు తెలుస్తుంది.ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ , శాటిలైట్ రైట్స్ కలిపి 9 కోట్ల వరకు పలికినట్లు సమాచారం.ఇక ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 5 కోట్లకు అమ్మినట్లు సమాచారం.దీనితో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తే కనుక కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.