ప్రియాంకా తమిళంలో గంగలేరు వంటి చిన్న ప్రాజెక్టుతో కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ మొదటి గుర్తింపు మాత్రం 2019లో టాలీవుడ్ లో నటించిన గ్యాంగ్ లీడర్ తో వచ్చింది. క్రిటిక్స్ ఆమె ఫ్రెష్ లుక్‌ని మెచ్చుకున్నా, సినిమా పెద్ద విజయం సాధించలేకపోయింది. అయినా ఈ సినిమా టాలీవుడ్‌లో ఆమెకు డోర్ ఓపెన్ చేసింది.” తర్వాత శ్రీకారం , సరిపోదా శనివారం లాంటి సినిమాలు చేసినా పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. ఈ గ్యాప్‌లోనే పవన్ కళ్యాణ్ OG నుంచి వచ్చిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ కు సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ అవుతోంది. ఈ పోస్టర్‌తోనే ఆడియన్స్ కి ఆమె క్యారెక్టర్ నేమ్ కన్మణిగా రివీల్ చేశారు మేకర్స్. దీంతో ఈ సినిమాలో ప్రియాంకాది కీలక పాత్రమో, అన్న అంచనాలు మొదలయ్యాయి.
Also Read : Mokshagna : వారెవ్వా.. మోక్షజ్ఞ.. లుక్ అదిరింది అబ్బాయ్
ఆమె తెలుగుతో పాటు తమిళంలో కూడా బిజీ అయ్యింది. సిరివెన్నెల, Doctor, Don, ఎతర్క్కుం తున్నిన్దవన్ సినిమాలు ఆమెను సౌత్ ఆడియన్స్ కి చేరువ చేశాయి. కానీ ఏ భాషలో చూసినా హీరోయిన్‌గా ఇమేజ్ బిల్డ్ అయ్యేలా పెద్ద హిట్, గ్లామర్, ఎమోషన్ మిక్స్ అయిన సాలిడ్ రోల్ మాత్రం ఆమె చేతికి రాలేదు. ప్రస్తుతం ప్రియాంకా అరుల్ మోహన్ ఆశలు OG మీదే. పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ OGలో ఆమె లీడ్ రోల్ చేస్తోంది. మాస్, పాన్-ఇండియా స్కేల్‌లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ హిట్ అయితే ఇదే ఆమె కెరీర్ కి అసలు బూస్ట్ అవుతుంది. గతం లో లాంగ్వేజ్ లిమిట్ అయినా, ఇప్పుడు తెలుగు నుంచి పాన్ ఇండియా స్థాయికి వెళ్లే అవకాశం OGతో కలగవచ్చు.