కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హైప్రొఫైల్ ప్రాజెక్ట్ ఇప్పటికే పోస్టర్‌లతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఎప్పటి నుండో ఉరిస్తున్న ఈ సినిమా టీజర్ ను తమిళనాడులో సెలెక్టెడ్ థియేటర్స్ లో రిలీజ్ చేసారు.
Also Read : Posani Case : సబ్ జైలుకు పోసాని.. నిలకడగా ఆరోగ్యం.
ఫ్యాన్స్ కోరుకున్నట్టుగానే దర్శకుడు అధిక్ రవిచంద్రన్, అజిత్ కుమార్ ఓ రేంజ్ లో చూపించాడు. అయితే GBU టీజర్ కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు తమిళనాడు హయ్యెస్ట్ వ్యూస్ పరంగా విజయ్ నటించిన మాస్టర్ 19.35 మిలియన్ వ్యూస్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ 17.46 మిలియన్ తో రెండవ ప్లేస్ లో ఉంది. ఇప్పడు ఈ రెండు సినిమాలను వెనక్కి నెట్టి GBU టీజర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. టీజర్ రిలీజైన 24 గంటల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ 32 మిలియన్ వ్యూస్ తో విజయ్ రికార్డును బద్దలు కొట్టి టాప్ 1 లో నిలిచించింది. కోలీవుడ్ హిస్టరీలో అత్యధిక వ్యూస్ రాబట్టిన హీరోగా అజిత్ కుమార్ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసాడు. జీవి ప్రకాష్ సంగీతం అందించిన ఈ సినిమా ఏప్రిల్ 10, 2025న విడుదలవుతుంది.