సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళిని కొద్దీ రోజలు కిందట ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వర్గ వైషమ్యాలు కలిగించే విధంగా పోసాని మాట్లాడారని జనసేన నేత ఫిర్యాదు మేరకు రైల్వే కోడూరు పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రస్తుతం 14 పోలీస్ రిమాండ్ లో ఉన్నారు. కాగా నిన్న రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానికి స్వల్ప అస్వస్థత గురయ్యారు. దీంతో పోసానిని కడప రిమ్స్ కు తరలించి పలువైద్య పరీక్షలు నిర్వహించారు. రిమ్స్ ఆస్పత్రిలో పోసానికి ఎకో టెస్ట్ తో పాటు పోసాని అడిగిన అన్ని పరీక్షలు చేయించారు పోలీసులు.
ఈ నేపథ్యంలో రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేసారు. పోసానికి ఎటువంటి అనారోగ్యం లేదని చాతి నొప్పి అని డ్రామా ఆడారుని, రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి, కడప రిమ్స్ వైద్యులు ఆయనకు ఎటువంటి అనారోగ్యం లేదని ధ్రువీకరించారు. అందుకే పోసానని తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలిస్తున్నాం’ అని అన్నారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి రాజంపేట సబ్ జైలులో ఉన్నారు. ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఉదయం అల్పాహారంగా గోదుమ ఉప్మా తిన్నారు పోసాని. రాజంపేట సబ్ జైల్లో మూడు రోజులు గా రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణ మురళికి నిన్న రాజంపేట, కడప ఆసుపత్రులలో వైద్య పరీక్షల అనంతరం తిరిగి రాత్రి సబ్ జైలు కు తరలించిన తర్వాత ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదన్న జైలు అధికారులు