Aditya Dhar : హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన ఆదిత్యధర్.. ఈ ఇద్దరితో నెక్ట్స్ మల్టీస్టారర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధురంధర్2 అనుకున్నట్లే ర్యాంపేజ్ వసూళ్లతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రీ బుకింగ్స్ నుండే నియర్లీ 150 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన ధురంధర్ ద రివేంజ్.. ఓపెనింగ్స్‌లో భారీ వసూళ్లను రాబట్టుకుంది. తొలి రోజే బాలీవుడ్ పేరిట ఉన్న రికార్డ్స్ చెరిపేసింది. ఈ మూవీతో రణవీర్ ఖాతాలో మరో హిట్ పడితే.. కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆదిత్య ధర్ హ్యాట్రిక్ హిట్ నమోదు చేశాడు.
ఉరితో దర్శకుడిగా ఇంట్రడ్యూసైన ఆదిత్యధర్.. ధురంధర్‌తో ఆల్ ఇండస్ట్రీ అటెన్షన్ గ్రాబ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు సీక్వెల్‌తో అతడి ఇమేజ్ డబుల్ కాదు ట్రిపుల్ అయ్యింది. బాలీవుడ్‌కు దొరికిన మరో వర్త్ బుల్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇక బాలీవుడ్డే కాదు.. అతడి మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్ టాలీవుడ్ కూడా ఫిదా అవుతోంది. ఇప్పటికే ధురంధర్2ని చూసిన టాలీవుడ్ సినీ ప్రముఖులు.. సినిమాను పొగడ్తలతో ముంచేస్తూ ట్వీట్ చేశారు. హ్యాట్రిక్ హిట్ తర్వాత ఆదిత్యధర్ ఎవరిని డీల్ చేయబోతున్నాడని క్యూరియాసిటీ మొదలైంది. అయితే ధురంధర్2ని ప్రశంసించిన తారక్, బన్నీతో మూవీ ఉండొచ్చన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చెప్పాలంటే బన్నీకి ఎప్పుడో ఇమ్మోర్టల్ అశ్వత్థామ స్టోరీని నెరేట్ చేశాడు ఆదిత్య. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. అయితే ధురంధర్ సక్సెస్ చూశాక మళ్లీ ఐకాన్ స్టార్ చర్చలు మొదలు పెట్టనున్నాడని సమాచారం. అలాగే తారక్‌తో కలిసి ఆదిత్యధర్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని రూమర్స్ ఊపందుకున్నాయి. తారక్- బన్నీ- ఆదిత్యధర్ కలిస్తే బాక్సాఫీస్ తగలబడిపోవడం ఖాయమే. అయితే ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా అనేదే డౌట్.
Also Read
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
- Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!