తమిళ నటి కస్తూరి కొద్ది రోజుల క్రితం చెన్నై లోని తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యల చేసిన సంగతి తెలిసిందే. అవి కాస్త వివాదానికి దారితీయడంతో తెలుగు నా మెట్టినిల్లు, తెలుగు వారంతా నా కుటుంబం అంటూ వివరణ ఇస్తూనే అధికార డీఎంకే వాళ్లు తనపై కుట్ర చేస్తున్నారని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కస్తూరి పై చెన్నై మరియు మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేసారు. ఈ వివాదంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల్లో బ్రాహ్మణేతరులు లంచాలు తీసుకుంటున్నారని కస్తూరి మాట్లాడడాన్ని ఉద్యోగ సంఘాలు ఖండించాయి.
Also Read : Sivakarthikeyan : అమ’రన్’ ఇప్పట్లో ఆగేలా లేదు.. టార్గెట్ రూ. 300 కోట్లు
ఈ నేపథ్యంలో కస్తూరిపై కేసు చెన్నైలోని పలు స్టేషన్స్ లో కేసులు నమోదు చేసారు పోలీసులు. కస్తూరిని విచారించేందుకు ఆమె ఇంటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉండడంతో కస్తూరి పరారీలో ఉన్నట్టు అవగాహనకు వచ్చారు. ఆమెకు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో విచారణకు రావాలని నోటీసులను ఇంటికి అతికించి వెళ్లారు పోలీసులు. పరారీలో ఉంటూనే ముందస్తూ బెయిల్ కోసం అప్లై చేసింది కస్తూరి. గత మూడు రోజులుగా పరారీలో ఉన్న నటి కస్తూరి మధురై హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ లో తెలుగు వారిపై తానూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలుగు వారిఇకి బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాను. అయిన కూడా నాపై ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేశారంటూ పిటిషన్ లో పేర్కొంది. ఈ బెయిల్ పిటిషన్ పై విచారించనున్న కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందినని ఎదురుచూస్తోంది కస్తూరి.