Nana Patekar Slaps Boy: నానా పటేకర్.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ విలక్షణ నటుడైన ఆయన పేరు మీటూ ఉద్యమంలో బాగా వినిపించింది. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా అతడిపై తీవ్ర ఆరోపణలు చేసి మీటూ ఉద్యమానికి తెరతీసింది. నానా పటేకర్ తనని శారీరకంగా, మానసికంగా వేధించాడని బహిరంగంగా ఆమె చేసిన కామెంట్స్ అప్పట్లో తీవ్ర దూమారం లేపాయి. ఆమె కామెంట్స్‌తోనే మీటూ ఉద్యమం బీజం పడింది. అలా తనుశ్రీ దత్తా ఆరోపణలతో వివాదంలో చిక్కున్న నానా పటేకర్ తాజాగా మరో వివాదంలో పడ్డాడు. తనతో సెల్ఫీ తీసుకుంటున్న అభిమానిపై చేయి చేసుకుని కాంట్రవర్సీ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వారణాసిలో జరగుతున్న తన అప్‌కమింగ్ మూవీ షూటింగ్‌లో పటేకర్ మంగళవారం పాల్గొన్నారు.
Also Read: Shaheed Express: పొగ లేకుండానే మోగిన ఫైర్ అలారం.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు.. ఏం జరిగిందంటే..
ఈ సందర్భంగా అక్కడ వీధుల్లో షూటింగ్ నిర్వహించగా.. సెట్ మధ్యలో ఓ యువకుడు వచ్చి ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ యువకుడిని గమనించిన పటేకర్ వెంటనే వెనకనుంచి తలపై కొట్టడంతో అతడు ముందుకు వెళ్లాడు. దీంతో పక్కనే ఉన్న బౌన్సర్ సదరు యువకుడి మెడ పట్టుకుని బయటకు నెట్టాడు. ఈ సంఘటన వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు నానా పటేకర్‌పై ఫైర్ అవుతున్నారు. ‘ఈ నటులను మనము దేవుళ్లలా ఆరాధిస్తాం కాబట్టి.. వారితో దెబ్బలు తినేందుకు ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. నానా పటేకర్ లాంటి స్టార్ నటుడు ఓ యువకుడిపై చేయి చేసుకోవడం దారుణం. అతడు స్టార్‌డమ్ అనే పిచ్చిలో ఉన్నాడు‘ అంటూ అతడిపై ఫైర్ అవుతున్నారు. వీరు అసలుహీరోలు కాదు.. నిజానికి రియల్ హీరోలు అంటే సరిహద్దుల్లో ఉండేవారు.. తెరపై ఉండేవారు కాదు‘ అంటూ నానా పటేకర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.
#WATCH | वाराणसी में फिल्म जर्नी की शूटिंग कर रहे नाना पाटेकर का फैन को थप्पड़ मारते हुए वीडियो वायरल हो गया। फैन नाना पाटेकर संग सेल्फी लेने पहुंचा तो अभिनेता ने गुस्से में उसके सिर पर थप्पड़ मारा। फिल्म की यूनिट के सदस्य ने लड़के की गर्दन पकड़कर भगाया। pic.twitter.com/oU2WrY2Bv1
— Hindustan (@Live_Hindustan) November 15, 2023