Shaheed Express: షాహిద్ ఎక్స్‌ప్రెస్‌లో కాపేపు ఫైర్ అలారం అలజడి సృష్టించింది. నిప్పూ లేదు, పొగా లేదు.. కానీ ఫైర్ అలారం మోగింది. దీంతో ఆ భోగీలో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఫైర్ అలారం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాక కాసేపు బిక్కుబిక్కుమంటూ గడిపారు. దీంతో రైల్వే సిబ్బందిని అలర్ట్ చేయడం అసలు విషయం బయటపడింది. ఇంతకి అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లాలోని గౌరీబజార్ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న షాహిద్ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్ ఎం6 అలారం మోగింది. ఒక్కసారిగా ఫైర్ అలారం శబ్దం వినిపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
Also Read: Central Government: జైల్లో నిషేధిత వస్తువులను వాడితే మూడేళ్లు శిక్ష..
మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ షాహిద్ ఎక్స్‌ప్రెస్ రైలు అమృత్‌సర్ నుంచి జయనగర్‌కు వెళుతోంది. అలారం మోగిన దాదాపు 45 నిమిషాల తర్వాత రైలు డియోరియా స్టేషన్‌కు చేరుకుంది. ఇక్కడ రైలును ఆర్పీఎఫ్, GRP తనిఖీ చేయగా రైలులో ఎక్కడా మంటలు లేవని గుర్తించారు. ఇక ఇది విని ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అలారం ఎందుకు మోగిందనేది వారికి అర్థం కాలేదు. ఈ రైలు గౌరీబజార్ స్టేషన్‌కు చేరుకునే సమయానికి పట్టాలపై గూడ్స్ రైలు ఉండటంతో ట్రైయిన్‌ను కాసేపు మెయిన్‌లైన్‌లోనే నిలిపివేశారు. అదే సమయంలో అక్కడ రైల్వేస్టేషన్ సమీపంలో చెత్తను తగులబెడుతున్నారు.
Also Read: Threat Call: టీసీఎస్ ఆఫీస్ కు బాంబు బెదిరింపు.. భయాందోళనలో ఉద్యోగులు
అందులో నుంచి పొగలు రావడంతో.. ఆ పొగలకు రైలులోని ఫైర్ అలారం యాక్టివేట్ అయిందని అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనపై గౌరీబజార్ రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. టౌన్ ప్రాంతంలోని రైల్వే లైన్ సమీపాని దగ్గరగా పెద్ద ఎత్తున చెత్తను తగులబెట్టారు. దీంతో విపరీతంగా మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంత పోగ కమ్ముకుపోయింది. ఆ పోగకు ఏసీ కోచ్‌లోని అలారం యాక్టివేట్ అయ్యి మోగిందని చెప్పారు. ఇక ఈ ఘటనపై స్టేషన్ సూపరింటెండెంట్ వారణాసి డివిజన్‌కు సమాచారం అందించారు. దాదాపు 17 నిమిషాల పాటు ఆగిపోయిన ట్రైన్ ఆ తరువాత జైపూర్ వైపు వెళ్లింది.