Aa Okkati Adakku : కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కామెడీ మూవీస్ తో ఎంతగానో అలరించిన నరేష్ ..ఆ తరువాత వరుసగా ఫ్లాప్స్ అందుకోవడంతో నరేష్ కామెడీ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు.యాక్టింగ్ స్కోప్ వున్న సీరియస్ పాత్రలను ఎంచుకొని ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసాడు.అల్లరి నరేష్ నటించిన నాంది,ఉగ్రం వంటి యాక్షన్ మూవీస్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.ఇలా వరుస యాక్షన్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నరేష్ రూటు మార్చి మళ్ళీ తన స్టైల్ ఆఫ్ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Read Also :Mahesh : కొడుకు గ్రాడ్యుయేషన్ పూర్తి.. మహేష్ ఎమోషనల్ పోస్ట్ వైరల్…
అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ కామెడీ మూవీ “ఆ ఒక్కటి అడక్కు”..ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన “ఫరియా అబ్దుల్లా” హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను మల్లి అంకం తెరకెక్కించారు.భారీగా ప్రమోషన్స్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.కానీ ఈ సినిమా రిలీజ్ అయి మోస్తరు విజయం సాధించింది. ఈ సినిమా కథ బాగున్నా కథనంలో కొత్తదనం లేకపోవడంతో యావరేజ్ గా నిలిచింది.ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేందుకు సిద్ధం అయినట్లు సమాచారం.ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.ఈ సినిమా మే 31 న స్ట్రీమింగ్ రానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.త్వరలోనే మేకర్స్ ఓటిటి రిలీజ్ పై అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం .