Mahesh : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది.మహేష్ ప్రస్తుతం తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమఔలి దర్శకత్వంలో నటిస్తున్నాడు.రాజమౌళి సినిమాకోసం మహేష్ తన లుక్ ని మార్చేసారు.ప్రస్తుతం ఆ సినిమా కోసం పూర్తి మేకోవర్ పై మహేష్ దృష్టి పెట్టారు.
Read Also :Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ షూటింగ్ పూర్తి.. యూనిట్ కి స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చిన మేకర్స్..
ఇదిలా ఉంటే మహేష్ తనయుడు గౌతమ్ తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.ఈ క్రమంలో మహేష్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసారు.”నా హృదయం గర్వంతో నిండిపోయింది. గౌతమ్.. నీ గ్రాడ్యుయేషన్ పూర్తి అయినందుకు అభినందనలు. నీ కెరీర్‌లో మరో నూతన అధ్యాయం మొదలైంది. ఈ అధ్యాయం నీవే రాయాల్సి ఉంది. నీ కలలను సాదించేందుకు ముందుకు సాగు..ఈ ప్రయాణంలో ఒక్క విషయం గుర్తుంచుకో నీపై మా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. ఈ రోజు తండ్రిగా నిన్ను చూసి ఎంతగానో గర్వపడుతున్నాను..” అని మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ చేసారు. ప్రస్తుతం గౌతమ్ గ్రాడ్యుయేషన్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.