ఇప్పటి జనరేషన్ కు అంతగా తెలియని ఓ అద్భుతమైన నటి శోభన. పేరుకు మలయాళమ్మాయి అయినప్పటికీ తెలుగులో ఆమెకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. 80-90స్‌లో వెండి తెరను ఓ ఊపు ఊపేసిందీ ఈ యాక్ట్రెస్. బేసికల్‌గా క్లాసికల్ డ్యానరైన శోభన కళ్లతోనే హవా భావాలు పలికించగలదు. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న మెయిన్ ఇండస్ట్రీ స్ లోని స్టార్ హీరోలతో వర్క్ చేసిన ఈ తారామణి కెరీర్ ఫేడవుటవుతోంది అనుకున్న టైంలో నటనకు బ్రేక్ ఇచ్చి తనకు ఎంతో ఇష్టమైన క్లాసికల్ డ్యాన్స్‌కు టైం కేటాయించింది.
Also Read : Single : కేతిక కల నెరవేర్చిన శ్రీ విష్ణు
40 ప్లస్, 50 ప్లస్‌లో హీరోయిన్లుగా రాణించాలంటే మాటలు కాదు. 30 ప్లస్ వస్తే అదర్ క్యారెక్టర్లకు షిఫ్టైన కాలం నుండి వచ్చిన శోభన మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరుపులు మెరిపించడమే కాదు ఆమె నటిస్తే రికార్డులు క్రియేట్ అయ్యేలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. అప్పుడెప్పుడో 18 ఏళ్ల క్రితం తెలుగు తెరకు దూరమైన ఈ సీనియర్ యాక్ట్రెస్ కల్కి 2898ఏడీ మరియంగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి పవర్ ఫుల్ ఫెర్మామెన్స్ చూపించింది. 2024లో వచ్చిన కల్కి ఆ ఏడాది హయ్యెస్ట్ సెకండ్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. తెలుగులోనే కాదు మలయాళంలో కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోన్న తుడరుమ్‌లో కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయ్యింది శోభన. సుమారు 15 ఏళ్ల తర్వాత మోహన్ లాల్‌తో జోడీ కట్టింది ఈ క్లాసికల్ డ్యాన్సర్. ఏప్రిల్ 25న రిలీజైన ఈ సినిమా 20 రోజుల్లోనే రూ. 200 కోట్లను కొల్లగొట్టి మలయాళంలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. లలితగా లాలట్టన్ భార్యగా చాలా సింప్లీ లుక్కులో కట్టిపడేసింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని 55 వయస్సులో ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అని ఫ్రూవ్ చేస్తూ.. తన తరం నటీమణులకు ఇన్సిపిరేషన్ అవుతోంది సీనియర్ యాక్ట్రెస్. ఈ ఏడాదే ఆమెను పద్మ భూషణ్ అవార్డ్ వరించింది. ఇక భవిష్యత్తులో మరిన్ని హై స్ చూడాలని ఆశిద్దాం.