కెరీర్ స్టార్ట్ చేసి నాలుగేళ్లవుతున్నా హిట్ ఎలా ఉంటుందో చూడలేదు. సక్సెస్ ఇచ్చే కిక్ ఎట్లుందో తెలియదు. బ్లాక్ బస్టర్ సౌండ్ కోసం చకోర పక్షిలా ఎదురు చూసిన మేడమ్ కల ఎట్టకేలకు తీరింది. అదిదా సర్పైజ్ అంటూ కేతిక శర్మ కెరీర్‌కు సింగిల్ పెద్ద బూస్టరయ్యింది. పూరి సన్ ఆకాష్ పూరి రొమాంటిక్‌తో ఇంట్రడ్యూసైన ఈ బాత్రూమ్ సింగర్ రాబిన్ హుడ్ వరకు సక్సెస్ ఎలా ఉంటుంది. అది ఇచ్చే కిక్ ఏ రేంజ్‌లో ఉంటుందని చూడలేదు. అన్నాదమ్ములు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఆమె ఫేట్ మార్చలేకపోయారు. కానీ సడెన్లీ శ్రీవిష్ణు లక్కీ మ్యాన్ అయ్యాడు.
Also Read : NTRNeel : ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఊరించి..ఉసూరుమనిపించిన మైత్రీ
రొమాంటిక్ సీన్లకు అడ్డుచెప్పకోయినా అందాల అరబోస్తున్నా కేతికకు హిట్ పడలేదు. ఆమె చేసిన త్యాగం వృథాగా మారిపోయింది. బాలీవుడ్‌లో ఓ ఓటీటీ సినిమాలో మెరిసిన మేడమ్ మళ్లీ టాలీవుడ్ చెంతకు చేరింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఫోర్ ఇయర్స్ అవుతున్నా హిట్ సౌండ్ వినలేదు. కెరీర్ డౌన్ ఫాలో అవుతున్న టైంలో ఆమెకు లక్కీ భాస్కర్ అయ్యాడు శ్రీ విష్ణు. రీసెంట్లీ రిలీజైన సింగిల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. పూర్వ, హరిణీ పాత్రలో ఒదిగిపోయారు కేతిక అండ్ ఇవానా. ఇవానా ఫస్ట్ టాలీవుడ్ ఫిల్మ్ కూడా ఇదే. ఎంట్రీ మూవీతోనే సక్సెస్ కొట్టేసింది. ఇప్పటి వరకు ఐరన్ లెగ్ ట్యాగేసుకుంటున్న కేతిక శర్మ ఇక లక్కీ లేడీగా మారి వరుస ఆఫర్స్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి.