తల అజిత్ “వాలిమై” నుండి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగల్ “నాంగా వెరా మారి” విడుదలైంది. నిన్న రాత్రి విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విఘ్నేష్ శివన్ రాసిన ఈ హై-ఆక్టేన్ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. యువన్ శంకర్ రాజా, అనురాగ్ కులకర్ణి పాడిన ఈ సాంగ్ అజిత్ అభిమానులకు భారీ ట్రీట్. విడుదలైన కొన్ని గంటల నుంచే “నాంగా వెర మారి” రికార్డులు సృష్టిస్తోంది. ఈ సాంగ్ జెట్ స్పీడ్ తో 2.5 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం.
Read Also : డబ్బూ రత్నాని క్యాలెండర్ పై మెరిసిన షారుఖ్
అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “వాలిమై”లో హ్యూమా ఖురేషి, కార్తికేయ, బాని, సుమిత్ర, అచ్యుంత్ కుమార్, యోగి బాబు, రాజ్ అయ్యప్ప, పుగజ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ బ్యానర్ పై బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీ నీరవ్ షా, ఎడిటింగ్ విజయ్ వెలుకుట్టి, స్టంట్స్ దిలిప్ సుబ్బరాయన్ అందిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా చివరి షెడ్యూల్ కోసం అజిత్, చిత్రబృందంతో కలిసి వచ్చే వారం రష్యా వెళ్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అజిత్ స్టైలిష్ లుక్స్, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా ఉండబోతున్నాయి.