డబ్బూ రత్నాని క్యాలెండర్ పై మెరిసిన షారుఖ్

ఫేమస్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాన్ని క్యాలెండర్ పై బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మెరిశారు. గతంలో చాలా సార్లు డబ్బూ రత్నాన్ని క్యాలెండర్‌ పై కన్పించిన షారూఖ్ ఈ సారి షర్ట్‌లెస్ అవతార్‌తో కన్పించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ పాపులర్ ఫోటోగ్రాఫర్ 2021 కోసం తన క్యాలెండర్ షాట్‌లను పంచుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి అభిమానులు షారుఖ్ అవతార్ చూడటానికి ఎదురు చూస్తున్నారు. ఈ ఫోటోషూట్ లో ఆయన క్లోజ్ అప్ షాట్ ను బంధించారు. అందులో షారుఖ్ ముఖం, భుజాలు మాత్రమే కన్పిస్తున్నాయి. తాజాగా ఈ పిక్ ను విడుదల చేయగా బాద్షా అభిమానులు దానిపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఈ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Read Also : సల్మాన్ భాయ్ లాగే నేనూ వర్జిన్… హీరో కామెంట్స్

ఇక షారుఖ్ ఖాన్ చివరగా “జీరో” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌తో కలిసి షారుఖ్ రొమాన్స్ చేశాడు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈరొమాంటిక్ డ్రామా 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. అంతకుముందు నుంచే వరుస డిజాస్టర్లను చవి చూస్తున్న ఆయన కొన్ని రోజులు సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. ప్రస్తుతం వెండితెరపై తిరిగి రావడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది అనే వార్తలు గత కొద్దీ రోజులుగా చక్కర్లు కొడుతున్నారు.

-Advertisement-డబ్బూ రత్నాని క్యాలెండర్ పై మెరిసిన షారుఖ్

Related Articles

Latest Articles