చియాన్ విక్రమ్ ని ఒక యాక్టర్ గా హై రేటింగ్ ఇవ్వడం ఇండియన్ సినీ అభిమానులకి బాగా అలవాటైన పని. క్యారెక్టర్ లోకి వెళ్లిపోయి, అందులో విక్రమ్ కనిపించకుండా కేవలం పాత్ర మాత్రమే కనిపించగలిగేలా చెయ్యడం విక్రమ్ స్టైల్. అందుకే ఒక పాత్రలో విక్రమ్ నటించబోతున్నాడు అనగానే ఆడియన్స్ లో ఈసారి ఎలాంటి కొత్త కోణం చూడబోతున్నాం అనే క్యురియాసిటీ ఉంటుంది. మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ని ప్రతి సినిమాలో ఇవ్వడం విక్రమ్ కి వెన్నతో పెట్టిన విద్య. విక్రమ్ చేసిన సినిమాలు బోగోలేవు అనే మాటని చాలా సార్లు వినుంటాం కానీ విక్రమ్ సరిగ్గా నటించలేదు అనే మాట ఇప్పటివరకూ వినిపించలేదు. అంత క్రెడిబిలిటీ ఉన్న విక్రమ్, చాలా రోజుల తర్వాత హిట్ డైరెక్టర్ తో కలిసి సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన ‘పా. రంజిత్’ దర్శకత్వంలో విక్రమ్ నటిస్తున్న సినిమా ‘తంగలాన్’. స్టూడియో గ్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ హైప్ ఉంది. విక్రమ్ కెరీర్ లోనే మోస్ట్ హైప్డ్ మూవీగా తంగలాన్ తెరకెక్కుతోంది.
జీవీ ప్రకాష్ మ్యూజిక్ హైలైట్ గా, మాళవిక మోహనన్ హీరోయిన్ గా భారి బడ్జట్ తో రూపొందుతున్న తంగలాన్ సినిమా అప్డేట్ కోసం ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపధ్యంలో డిజైన్ చేసిన పీరియాడిక్ డ్రామాగా రానున్న తంగలాన్ సినిమా షూటింగ్ 80% కంప్లీట్ అయ్యింది, బాలన్స్ 20%ని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని పా.రంజిత్ తెలిపాడు. ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ఏప్రిల్ 17న విక్రమ్ పుట్టిన రోజున తంగలాన్ సినిమా అప్డేట్ ఇస్తాము అంటూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ సంధర్భంగా మేకర్స్ ఒక కొత్త పోస్టర్ ని కూడా వదిలారు. విక్రమ్ ఇందులో చాలా రగ్గడ్ గా కనిపిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ KGFలో స్టైలిష్ మాస్ యాక్షన్ చూపిస్తే, పా.రంజిత్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ని చూపించబోతున్నట్లు ఉన్నాడు. మరి ఎంటైర్ కోలీవుడ్ వెయిట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ బయటకి రానుంది చూడాలి.
Get ready for something powerful from the world of #Thangalaan!
Witness a slice of flesh on #ChiyaanVikram's birthday
17th April, 2023@Thangalaan @chiyaan @beemji @kegvraja @StudioGreen2 @officialneelam @parvatweets @MalavikaM_ @PasupathyMasi @DanCaltagirone @thehari___ pic.twitter.com/9FnawFWmzb— Studio Green (@StudioGreen2) April 9, 2023