శివపుత్రుడు, ఐ, శేషు లాంటి సినిమాల పేర్లు వినగానే ఆ క్యారెక్టర్స్ ని మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన చియాన్ విక్రమ్ గుర్తొస్తాడు. ఎలాంటి పాత్రలో అయినా మెప్పించగల విక్రమ్ చేసిన సినిమాలు బోగోలేవు అనే మాటని చాలా సార్లు వినుంటాం కానీ విక్రమ్ సరిగ్గా నటించలేదు అనే మాట ఇప్పటివరకూ వినిపించలేదు. అంత క్రెడిబిలిటీ ఉన్న విక్రమ్, ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. కొత్త దర్శకులు, కొత్త కథలు అంటే విక్రమ్…
చియాన్ విక్రమ్ ని ఒక యాక్టర్ గా హై రేటింగ్ ఇవ్వడం ఇండియన్ సినీ అభిమానులకి బాగా అలవాటైన పని. క్యారెక్టర్ లోకి వెళ్లిపోయి, అందులో విక్రమ్ కనిపించకుండా కేవలం పాత్ర మాత్రమే కనిపించగలిగేలా చెయ్యడం విక్రమ్ స్టైల్. అందుకే ఒక పాత్రలో విక్రమ్ నటించబోతున్నాడు అనగానే ఆడియన్స్ లో ఈసారి ఎలాంటి కొత్త కోణం చూడబోతున్నాం అనే క్యురియాసిటీ ఉంటుంది. మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ని ప్రతి సినిమాలో ఇవ్వడం విక్రమ్ కి వెన్నతో పెట్టిన విద్య.…