దర్శకుడు బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో చిరులోని మాస్ ని ఎమోషనల్ సీన్స్ తో అలా టచ్ చేసి వదిలేసాడు. ఈసారి మాత్రం వింటేజ్ మాస్ అనే పదానికే బాస్ నిలువెత్తు నిదర్శనం అనేలా చేస్తాను అంటున్నాడు మెహర్ రమేష్. చాలా రోజులుగా సినిమాలకి దూరంగా ఉన్న మెహర్ రమేష్, మెగాస్టార్ తో ‘భోళాశంకర్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన కలకత్తా సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఇంటరెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తమిళ్ లో అజిత్ నటించిన మాస్ మసాలా సూపర్ హిట్ మూవీ ‘వేదాలం’. ఈ సినిమాని చిరుతో రీమేక్ చేస్తున్న మెహర్ రమేష్, వింటేజ్ మెగాస్టార్ ని ఒక రేంజులో చూపించడానికి సిద్దమవుతున్నాడు. ఇందుకోసం చిరు సూపర్ హిట్ మూవీ ‘చూడాలని ఉంది’లోని రామ్మా చిలకమ్మా సాంగ్ ను రీమిక్స్ చెయ్యనున్నారు అనే టాక్ వినిపిస్తోంది. మణిశర్మ మ్యూజిక్ ని, చిరు – సౌందర్యల డాన్స్ ని అప్పట్లో తెలుగు ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఈ పాటని రీమిక్స్ చేసి భోళాశంకర్ సినిమాలో పెట్టారట.
Read Also: Kashmira Pardeshi: అందాల భామ రీ-ఎంట్రీలో ఒకటి హిట్… ఒకటి ఫట్!
అలాగే ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ ఖుషి నడుము సీన్ ని రిపీట్ చేసినట్లు సమాచారం. ఖుషి లో పవన్ – భూమిక ల మధ్య ఉన్న నడుము అప్పట్లో ఒక సెన్సేషన్. భోళాశంకర్ సినిమాలో చిరు, పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ గా నటిస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఐకానిక్ సీన్ ఒకటి సినిమాలో పెట్టగలిగితే బాగుంటుంది అనే ఆలోచన నుంచి ఈ నడుము సీన్ ని రిపీట్ చెయ్యాలని డిసైడ్ అయ్యారట. ఆ ఐకానిక్ సీన్ ని భోళాశంకర్ లో యాంకర్ శ్రీముఖి – చిరంజీవి ల మధ్య డిజైన్ చేసారట. “నువ్వు నా బొడ్డు చూశావ్ అని శ్రీముఖి.. అసలు అక్కడ బొడ్డు ఎక్కడుంది అన్నీ ముడతలేగా” అని మెగాస్టార్ సరదాగా మాట్లాడుకునే సీన్ ఒకటి చిత్ర యూనిట్ ప్లాన్ చేశారట. మరి ఈ సీన్ భోళాశంకర్ సినిమాని చూసే సమయంలో మెగా ఫాన్స్ ని ఎంతగా ఎంటర్టైన్ చేస్తాయో చూడాలి.