మూడున్నర దశాబ్దాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ హీరోలుగా ఉన్న స్టార్స్ ‘చిరంజీవి’, ‘బాలకృష్ణ’. సినిమాల రిజల్ట్స్ కి అతీతంగా ఫాన్స్ ని సంపాదించుకున్న ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర ఎదురుపడితే అదో చిన్న సైజ్ యుద్ధంలా ఉంటుంది. ‘ఎల్-క్లాసికో’ లాంటి ఈ బాక్సాఫీస్ క్లాష్ ని మెగా నందమూరి అభిమానులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇప్పటివరకు 15 సార్లు జరిగిన ఈ బాక్సాఫీస్ వార్, 2017లో చివరిసారి జరిగింది. 2017లో చిరు నటించిన ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణ నటించిన ‘గౌతమీ పుత్ర శతకర్ణీ’ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయాలుగా నిలిచాయి. మరోసారి ఈ వార్ ని రిపీట్ చేస్తూ చిరు బాలయ్యలు బాక్సాఫీస్ ఫైట్ కి రెడీ అయ్యారు. 2023 సంక్రాంతికి చిరు ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు పోటి పడబోతున్నాయి అనే అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి సినీ అభిమానుల్లో ఎవరు హిట్ ఇస్తారు అనే డిస్కషన్ స్టార్ట్ అయ్యింది.
ఎవరు హిట్ ఇస్తారు అనే డిస్కషన్ ని కాసేపు పక్కన పెడితే… మాస్ గెటప్ లో చిరు, ఫ్యాక్షన్ గెటప్ లో బాలయ్య వస్తున్నారు అంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు భారి స్థాయిలో ఉంటాయి. ఆ అంచనాలకి తగ్గట్లే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాల ప్రమోషన్స్ ని చేస్తోంది. రెండు సినిమాల నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి కానీ ప్రమోషన్స్ లో స్పీడ్ కనిపించట్లేదు. మొదటి పాట వచ్చి హిట్ అయిన తర్వాత రెండు సినిమాల నుంచి ఒక్క పోస్టర్ కూడా బయటకి రాలేదు, సెకండ్ సాంగ్ ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేదు. మరోవైపు సంక్రాంతి సీజన్ లోనే ప్రేక్షకుల ముందుకి రానున్న ‘వారిసు’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యింది, సెకండ్ సాంగ్ ఎప్పుడో చెప్పేశారు, మంచి మంచి పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ విషయంలో దిల్ రాజు చూపిస్తున్న స్పీడ్ ని మైత్రి మూవీ మేకర్స్ చూపించట్లేదు. చిరు బాలయ్యల ఫాన్స్ యాక్టివ్ అవ్వాలి అంటే ప్రమోషన్స్ లో జోష్ కనిపించాలి. ఆ జోష్ ని మైత్రి ఎప్పుడు చూపిస్తుందో? రిలీజ్ డేట్స్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో చూడాలి.