మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చింది. చిరు వింటేజ్ మాస్ గెటప్ లో కనిపించి సంక్రాంతిని కాస్త ముందుగానే తెచ్చాడు. ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది వాల్తేరు వీరయ్య సినిమా. చిరు టైమింగ్, డాన్స్ లో గ్రేస్, ఫ్యాన్ స్టఫ్ ని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసిన దర్శకుడు బాబీ, రవితేజ ఎపిసోడ్ ని వాల్తేరు వీరయ్య సినిమాకే హైలైట్ గా మలిచాడని ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. గత మూడు సినిమాల్లో చిరు నుంచి ఫాన్స్ మిస్ అయిన ప్రతి ఎలిమెంట్ వాల్తేరు వీరయ్య సినిమాలో కనిపించడంతో మెగా ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. వింటేజ్ బాస్, మెగా మేనియా అంటూ ఓవర్ జాయ్ తో ఊగిపోతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ కి థియేటర్స్ లో ఫాన్స్ రచ్చ చేస్తున్నారు.
ఈ మెగా మాస్ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం పండగ జోష్ ని మరింత పెంచింది. ఈ మూవీ ఆన్ లైన్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాదాపు నెలన్నర రెండు నెలల తర్వాత వాల్తేరు వీరయ్య ఆన్ లైన్ లో కనిపించే అవకాశం ఉంది. 8 వీక్స్ విండో ని బేస్ చేసుకోని మైత్రీ మూవీ మేకర్స్ వాల్తేరు వీరయ్యని రెండు నెలల వరకూ ఒటీటీలో విడుదల చేసే ఛాన్స్ లేదు. చిరుని వింటేజ్ గెటప్ లో చూడాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరూ థియేటర్స్ కి వెళ్లే మెగా మాస్ ని ఎంజాయ్ చెయ్యాల్సిందే. అయినా చిరుని థియేటర్స్ లో అభిమానుల మధ్య చూసి ఎంజాయ్ చేస్తే వచ్చే కిక్ ఇంట్లో కూర్చోని టీవీలో చూస్తే రాదు కదా. సో ఈ ఫెస్టివల్ కి థియేటర్స్ కి వెళ్లి మెగామాస్ ని ఎంజాయ్ చెయ్యండి.