Mass Maharaja: చిరుతో రవితేజ ఇట్స్ అఫీషియల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రుతీహాసన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయిపోయింది. తాజాగా మొదలైన షెడ్యూల్ కి సంబంధించిన సూపర్ అప్ డేట్ ను మూవీ మేకర్స్ శనివారం ఇచ్చారు. ఈ సినిమాలో మాస్ మహరాజా రవితేజా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారన్న విషయం ఎప్పటి నుండో ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అయితే ఆ విషయాన్ని అధికారికంగా చిత్ర బృందం ఇంతవరకూ ప్రకటించలేదు. సమయం వచ్చినప్పుడు, సరైన పద్ధతిలో ప్రకటించాలని వేచి చూసింది. అందుకు ఇదే సరైన సమయంగా దర్శక నిర్మాతలు భావించినట్టు తెలుస్తోంది.
Also Read
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
- Hashmi - Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
- Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
- Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
మెగా స్టార్ తో మాస్ మహరాజా జత కలిశారంటూ ఓ చిన్నపాటి టీజర్ ను సాటర్ డే రిలీజ్ చేశారు. ‘ద మాస్ ఫోర్స్ జాయిన్స్ ద మెగా స్టార్మ్’ అనే కాప్షన్ తో ఈ టీజర్ వచ్చింది. మూవీ షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి రవితేజ రేంజ్ రోవర్ లో వచ్చి, చిరంజీవి ఉన్న కారవాన్ తలుపు తట్టగానే మెగాస్టార్ డోర్ తీసి, చెయ్యి ఇచ్చి రవితేజను లోపలికి ఆహ్వానించాడు. ఆ తలుపు వెనుకే ఉన్న దర్శకుడు బాబీ ‘మెగా మాస్ కాంబో బిగెన్స్’ అనడంతో ఈ టీజర్ ముగిసింది. గతంలో చిరంజీవి ‘అన్నయ్య’ మూవీలో రవితేజ తమ్ముడిగా కీలక పాత్ర పోషించాడు. మళ్ళీ ఆ స్థాయిలో వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే. ఇంకా పేరు నిర్ణయించని ఈ మూవీ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. చిరంజీవిని డైరెక్ట్ చేయడం బాబీకి ఇదే మొదటిసారి కాగా రవితేజ ‘పవర్’ అతనికి దర్శకుడిగా తొలి చిత్రం!
తాజావార్తలు
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!