టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కలిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. అయితే అసలు సల్మాన్ ను హరీష్ ఎందుకు కలిశాడు ? అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు హరీష్ సల్మాన్ తో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడని, అందుకే సల్మాన్ ని కలిశాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న తాజా గాసిప్. ఈ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోందని టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ టాలీవుడ్ లో మాత్రం పుకారు షికారు చేస్తోంది.
Read Also : Prabhas : ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్-2’ హిట్స్ పై రెబల్ స్టార్ రియాక్షన్
ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో “టైగర్ 3” వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి “గాడ్ ఫాదర్”లో అతిథిగా కనిపించనున్నాడు సల్మాన్. ప్రస్తుతం రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి డైరెక్టర్స్ టాలీవుడ్, బాలీవుడ్ పరిధులను చెరిపేయగా, సల్లూ భాయ్ తెలుగు దర్శకుడి డైరెక్టన్ లో చేయడానికి మొగ్గు చూపుతాడో లేదో చూడాలి. హరీష్ శంకర్ విషయానికొస్తే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా “భవదీయుడు భగత్ సింగ్” అనే ప్రాజెక్ట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.