మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ థియేటర్లలో సందడి చేస్తోన్న వేళ, సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ సినిమాను గతంలో వచ్చిన సూపర్ హిట్ వెంకటేష్ ‘తులసి’, తమిళ ‘విశ్వాసం’ సినిమాలతో పోలుస్తూ నెటిజన్లు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. అయితే, ఈ మూడు సినిమాలకు ఉన్న ఒకే ఒక్క కామన్ పాయింట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మూడు సినిమాల్లోనూ హీరోయిన్గా నటించింది మరెవరో కాదు.. లేడీ సూపర్ స్టార్ నయనతార. అవును, వెంకటేష్ నటించిన ‘తులసి’, అజిత్ హీరోగా వచ్చిన ‘విశ్వాసం’ (తెలుగులో కూడా అదే పేరుతో విడుదలైంది), అలాగే ఇప్పుడు చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’.. ఈ మూడింటిలోనూ ఆమే హీరోయిన్.
Also Read:USB condom: USB కండోమ్ .. ప్రయోజనాలు అదుర్స్ !
ఈ మూడు సినిమాలు కూడా బలమైన కుటుంబ విలువలు, ఎమోషన్స్ చుట్టూ తిరుగుతాయి. తండ్రి-కూతురు లేదా తండ్రి-కొడుకు మధ్య ఉండే అనుబంధం ఈ చిత్రాల్లో హైలైట్‌గా నిలిచింది. ‘తులసి’లో భర్తను ప్రేమించే భార్యగా, ‘విశ్వాసం’లో పంతం ఉన్న ఇల్లాలుగా ఆమె నటన ఎంతటి గుర్తింపు తెచ్చిందో తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి సరసన కూడా అంతే హుందాతనంతో కూడిన పాత్రలో ఆమె మెరిశారు. తులసి, విశ్వాసం , మన శంకర్ వరప్రసాద్ సినిమాలలో భార్యాభర్తలు విడిపోయి కలుసుకోవడం కామన్ పాయింట్. యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ, క్లైమాక్స్ వచ్చేసరికి ప్రేక్షకుడిని కంటతడి పెట్టించే ఎమోషన్ ఈ మూడు సినిమాల్లోనూ కామన్ ఫ్యాక్టర్ అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఈ ముగ్గురు పెద్ద హీరోల సినిమాల్లో నయనతార భాగం కావడం, ఆ సినిమాలు ఒకే తరహా ఎమోషనల్ కనెక్టివిటీని కలిగి ఉండటం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.