Chiranjeevi Lauds Teja Sajja for his impressive journey in cinema at SIFF: హీరోగా పోలీసులు సినిమాలు చేసి ఈ మధ్యనే హనుమాన్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు తేజ. ఈ సినిమాతో ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసి పాన్ ఇండియా హీరో అయిపోయాడు. అయితే తేజ మీద తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. కొన్నాళ్ల క్రితం జరిగిన సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 20 24 కి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒక వీడియోలో మెగాస్టార్ చిరంజీవి తేజ జర్నీ గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు. నిజానికి ముందుగా యాంకర్ మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నిస్తూ చాలామంది మీలాంటి మీరు చేస్తున్న సినిమాలు చేస్తే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు.
Aavesham: ఫహద్ ‘ఆవేశం’తో మలయాళమోళ్ళు ఇంకో హిట్ కొట్టేశారు!
అయితే మీరు ఎప్పుడైనా ఫలానా సినిమా చేస్తే బాగుండేది అనుకున్నారా? అని అడిగితే అప్పుడు తేజ సజ్జా గురించి చెబుతూ తేజ నేను హీరోగా నటించే కొన్ని సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించాడు. అతనికి ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు కానీ నాలాంటి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని హనుమాన్ అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. 25 ఏళ్ళ క్రితం చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలై నా సినిమాల ఇన్స్పిరేషన్ తో ఆయన హనుమాన్ సినిమా దాకా వచ్చాడు. నేను హనుమాన్ అనే పేరుతో ఒక సినిమా చేయాలనుకున్నా, కానీ తేజ చేసిన హనుమాన్ సినిమా చూసిన తర్వాత ఇక నేను హనుమాన్ సినిమా చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది సినిమా నాకు ఆ సినిమా చేసేసిన సంతృప్తి కలిగించాడు. తేజని నేను వేరుగా చూడటం లేదు తేజ కూడా నా జర్నీలో భాగమే అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.