Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కష్టం అన్న మాట వినిపిస్తే చిరు ముందు ఉంటాడు. తన, మన అని లేకుండా కళాకారులకు ఏదైనా సహాయం కావాలంటే.. చిరు పేరే వినిపిస్తుంది. ఇక చేసిన సహాయాన్నిచెప్పుకొనే టైప్ కాదు చిరంజీవి. ఈ విషయం ఎంతోమంది నటీనటులు మీడియా ముందే చెప్పుకొచ్చారు. సాధారణంగా.. స్నేహితులకు బాగోకపోతే .. ఎక్కడ డబ్బు అడుగుతారేమో అని తప్పించుకొని తిరుగుతారు కొందరు. కానీ, చిరంజీవి మాత్రం చిన్ననాటి స్నేహితుడు హాస్పిటల్ లో ఉన్నాడని తెలుసుకొని స్వయంగా హాస్పిటల్ కు వెళ్లి పలకరించాడు. చిరు చిన్నతనం మ్మొత్తం మొగల్తూరు లో గడిచిన సంగతి తెల్సిందే. ఇక అతనికి పువ్వాడ రాజా అనే స్నేహితుడు ఉన్నాడు.
Jabardasth Dhanraj: పవన్ డైరెక్టర్ నే డైరెక్ట్ చేయబోతున్న జబర్దస్త్ కమెడియన్
చిన్నప్పుడు ఎప్పుడో కలిసి తిరిగిన స్నేహితుడు ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో ఆయనే స్వయంగా రాజాకు ఫోన్ చేసి.. హైదరాబాద్ కు తీసుకొచ్చి అపోలోలో చికిత్స ఇప్పించాడు. అంతేకాకుండా ఈరోజు.. హాస్పిటల్ కు వెళ్లి .. ఫ్రెండ్ ను పలకరించి బాగోగులు తెలుసుకున్నాడు. ఇందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ మధ్యనే చిరుకు సైతం మోకాలి సర్జరీ జరిగిన విషయం తెల్సిందే . ఇప్పడిప్పుడే కోలుకుంటున్న చిరు.. తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఫ్రెండ్ ను కలవడానికి వెళ్లడం అద్భుతమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చిరు చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. చిరు ఆరోగ్యం మెరుగైన తరువాత షూటింగ్ మొదలు కానుంది.