మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం “ఆచార్య” చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ నెలకొంది. ముందుగా ఈ సినిమా దసరా బరిలో నిలుస్తుందని అన్నారు. ఆ తరువాత సంక్రాంతి అని రూమర్స్ మొదలయ్యాయి. కానీ ఇప్పటికే సంక్రాంతికి ఇద్దరు పెద్ద సినిమాలు రేసులో ఉన్నాయి. మరి ‘ఆచార్య’ కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే సాహసం చేస్తాడా ? అంటూ పలు అనుమానాలు లేవనెత్తుతున్నారు ప్రేక్షకులు. అంతేకాదు ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇంకా ఎందుకు ప్రకటించడం లేదు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
Read Also : కనికరించండి… ఏపీ సీఎంకు చిరు రిక్వెస్ట్
నిన్న రాత్రి “లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోని సమస్యల గురించి మాట్లాడుతూరెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దయచేసికనికరించి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలంటూ కోరారు. ఈ నేపథ్యంలోనే ‘ఆచార్య’ సినిమా ఇంకా ఎందుకు విడుదల కాలేదు అనే విషయాన్ని వెల్లడించారు. “సినిమాలు పూరయ్యి కూడా విడుదల చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయాము. ‘ఆచార్య’ విషయానికొస్తే… సినిమా పూరైయిపోయింది. కానీ ఎప్పుడు రిలీజ్ చేయాలి ? ఎలా రిలీజ్ చేయాలి ? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం టార్గెట్ ను రీచ్ అవ్వగలమా ? రిలీజ్ చేస్తే రెవెన్యూ వస్తుందా రాదా? ఇప్పుడిప్పుడే జనం థియేటర్లకు వస్తారా అనే భయం పోయి నెమ్మదిగా ధైర్యం వస్తోంది. ఇలాంటి యంగ్ స్టర్స్ ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తే జనాలు చూడడానికి ఖచ్చితంగా వస్తారు. అయితే సినిమా విడుదలయ్యాక రెవెన్యూ వస్తుందా ? అనేది మాత్రం మనము ఆలోచించాలి. ఆ ధైర్యం, వెసులుబాటు ప్రభుత్వాలు మనకు ఇవ్వాలి. మా కోరికను మీకు విన్నవించాము. దానికి సానుకూలంగా స్పందించి ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఏపీలో టిక్కెట్టు ధర లేనందుకే “ఆచార్య” రిలీజ్ కు వెనకడుగు వేస్తున్నాడని స్పష్టం అయ్యింది.